టాలీవుడ్ లో నందమూరి ఫ్యామిలీకి ఎంత పెద్ద పేరు ఉందో మనందరికీ తెలుసు. ఇక జూనియర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ ను సొంతం చేసుకున్నారు. దీంతో తారక్ సినిమాల కోసం ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఎన్టీఆర్ 30 వర్కింగ్ టైటిల్ తో రాబోతున్నాడు. ఈ సినిమాకి కొరటాల శివ డైరెక్టర్ గా చేస్తున్నారు. ఇక నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ యువ సుధా ఆర్ట్స్ బ్యానర్ పై కోసరాజు హరికృష్ణ సుధాకర్ మిక్కిలినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా 2024 ఫిబ్రవరి 5వ తేదీన విడుదలకి సిద్ధమవుతోందట.
ఇప్పటికే విడుదలైన ఎన్టీఆర్ 30వ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ అంచనాలను పెంచేసింది. అందులో కత్తులు పట్టుకున్న తారక్ చేతులు మాత్రమే కనిపిస్తున్నాయి. వెన్ కరేజ్ టర్న్స్ ఏ డిసీజ్.. ఫియర్ ఈజ్ ది ఓన్లీ క్యూర్’ అంటూ క్యాప్షన్ కూడా పోస్టర్ ఆకట్టుకుంది. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాలో ముగ్గురు స్టార్ హీరోస్ ను విలన్స్ గా తీసుకుంటున్నారట .తెలుగు ,తమిళ్, బాలీవుడ్ స్టార్లను తీసుకోబోతున్నారట డైరెక్టర్ కొరటాల శివ తెలిపారు
హిందీ నుంచి సైఫ్ అలీ ఖాన్, తమిళ్ నుంచి చియాన్ విక్రమ్ ఇక ఈ సినిమాలో విలన్ పాత్ర కోసం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతిని కూడా సంప్రదించారట. ఇప్పటికే ఓవైపు హీరోగా మరోవైపు విలన్ పాత్రలతో విజయ్ సేతుపతి సౌత్ తో పాటు హిందీలో కూడా వరుస ప్రాజెక్టు చేస్తున్నారు. ఒక వేళ ఎన్టీఆర్ సినిమాకు విలన్ గా విజయ్ సేతుపతి సెట్ చేసుకుంటే మాత్రం ఆ సినిమా ఓ లెవెల్ లో ఉంటుందని ఆయన ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇంతకు ఈ సినిమాకి విలన్ గా ఎవరిని తీసుకుంటారో కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.