హాలీవుడ్ లో మహేష్ జోరు..అందుకే…

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్, కోలీవుడ్ లో ఇప్పుడు మహేష్ బాబు కు ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. గత ఏడాది భరత్ అనే నేను సినిమాతో రెండు వందల కోట్ల క్లబ్ లో చేరాడు మహేష్. ప్రస్తుతం వంశి పైడిపల్లి దర్శకత్వంలో ‘మహర్షి’సినిమాలో నటిస్తున్నాడు.

తాజాగా మహేష్ కి హాలీవుడ్ నుంచి ఆహ్వానం అంది. మహర్షి మూవీ షూటింగ్ సమయంలో ఎక్కువగా విదేశాల్లో షూటింగ్ జరుపుకోవడం..మహేష్ క్రేజ్ అక్కడి వారికి తెలియడం జరిగింది. ఈ నేపథ్యంలో హాలీవుడ్ లో ఇప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్స్ గా పేర్కొనే ప్రిడేటర్, ఎక్స్ మెన్ చిత్రాల్లో నటించిన బిల్ డ్యూక్ తాజాగా మహేశ్ బాబును లంచ్ కు ఆహ్వానించారు.

‘కమాండో’,‘ప్రిడేటర్’,‘ఎక్స్ మెన్: ది లాస్ట్ స్టాండ్’ లాంటి సినిమాలతో పాపులర్ అయిన హాలీవుడ్ నటుడు బిల్ డ్యూక్, మహేష్ ని ఆహ్వానించడం సెన్సేషన్ అయ్యింది. మహేష్ బాబుతో ఒక స్పై మూవీ చేయాలని, అందులో తాను నటించాలని కోరుకోరుతూ ట్వీట్ చేయటం హాట్ టాపిక్ గా మారింది. ఇక మహిళల అక్షరాస్యత అభివృద్ధి విషయంలో అంతర్జాతీయ కార్యక్రమాల ఏర్పాటు గురించి చర్చిద్దామని ఐశ్వర్య ధనుష్‌కు బిల్‌ చెప్పారు. ఐశ్వర్యను 2016లో యునైటెడ్ నేషన్స్ ఉమెన్స్ గుడ్‌విల్‌ అంబాసిడర్‌గా ఎంపిక చేసింది. ఈ మేరకు ఆమె మహిళల అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు.

అంతే కాదు..వంశీ పైడిపల్లి, మహేశ్‌బాబు మీరు లాస్‌ ఏంజెల్స్‌కు వచ్చినప్పుడు డీటీఎల్‌ఏ (డౌన్‌టౌన్‌ లాస్‌ఏంజెల్స్‌)లో దిగి, భోజనానికి రండి. ఇంటర్నేషనల్‌ స్పై సినిమా గురించి చర్చించుకుందాం’ అని బిల్‌ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ బిల్ డ్యూక్ అభిమానుల కంటే మహేశ్ బాబు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

Share.