లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ రిలీజ్ వాయిదా.. అంతా అనుకున్నట్టుగానే..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సంచలన దర్శకుడు రామ్ గోపాల డైరక్షన్ లో వస్తున్న లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమా మార్చి 22న రిలీజ్ అంటూ ప్రచారం చేశారు. అయితే సెన్సార్ వారు ఈ సినిమా రిలీజ్ కు బ్రేక్ వేశారు. ఎలక్షన్స్ టైంలో ఇలాంటి సినిమా వస్తే ఎలా అని.. సినిమా సెన్సార్ ను ఆఫ్టర్ ఎలక్షన్స్ చేస్తామని అన్నారట. అయితే సెన్సార్ వాళ్లు కేవలం సినిమాకు సర్టిఫికెట్ మాత్రమే ఇవ్వాలి తప్ప సినిమా వాయిదా వేసే అధికారం లేదని.. దీనిపై తాను కేసు పెడతానని అన్నాడు వర్మ.

ఇదిలాఉంటే సెన్సార్ వాళ్లు సినిమా సర్టిఫికెట్ ఇవ్వడం జాప్యం చేస్తున్నరట. ఈ క్రమంలో మార్చి 22న అనుకున్న సినిమా కాస్త మార్చి 29 కి వాయిదా వేసినట్టు తెలుస్తుంది. అప్పటివరకు సెన్సార్ వాళ్లను ఎలాగైనా ఒప్పించి సినిమా బయటకు తెచ్చే ప్రయత్నాలు చేసారట. సెన్సార్ కు ఎదురెళ్తున్న వర్మ లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ ను రిలీజ్ చేసుకుంటాడా లేక అతనే వెనక్కి తగ్గుతాడా అన్నది చూడాలి.

ఎన్.టి.ఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ఎంటరైన టైం నుండి లక్ష్మీ ఎన్.టి.ఆర్ సినిమా ఉంటుందట. సినిమా నుండి వచ్చిన టీజర్, ట్రైలర్స్ అన్ని సినిమాపై క్రేజ్ పెంచాయి. తాను చెప్పేదే ఎన్.టి.ఆర్ అసలు కథ అంటూ వర్మ ప్రమోషన్స్ బాగా చేస్తున్నాడు. మరి అనుకున్నట్టుగానే లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ రిలీజ్ వాయిదా కన్ ఫాం కాగా మార్చి 29న అయినా సినిమా రిలీజ్ చేస్తారా లేదా అన్నది చూడాలి.

Share.