మంచు మనోజ్ గత కొంతకాలంగా కొన్ని వ్యక్తిగత కారణాలవల్ల పెద్ద ఎత్తున వైరల్ గా మారుతున్నారు. ప్రముఖ రాజకీయ దివంగత నేత భూమా నాగిరెడ్డి రెండవ కుమార్తె భూమ మౌనికతో రిలేషన్ లో ఉన్నట్లుగా గడిచిన కొద్దిరోజుల క్రితం నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. వీరి వివాహం ఈ ఏడాది జరగబోతోంది అంటూ కూడా పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. ఈ వార్తలకు అనుగుణంగానే మంచు మనోజ్ కూడా త్వరలోనే గుడ్ న్యూస్ చెప్పబోతున్నానని కూడా తెలియజేయడం జరిగింది.
దీంతో మంచు మనోజ్ సోషల్ మీడియాలో ఎలాంటివి రాసుకు వచ్చినా సరే తన రెండవ వివాహం గురించి అంటూ పెద్ద ఎత్తున వైరల్ గా మారుతున్నాయి. కానీ మంచు మనోజ్ మాత్రం కేవలం తన సినిమా గురించి ప్రకటిస్తూ అందరికీ షాక్ ఇచ్చారు. వాట్ ద షిప్ అనే మూవీ ని ప్రకటిస్తూ అందరిని ఆశ్చర్యపరిచారు.అయితే ఈయన పెళ్లి గురించి మాత్రం చెప్పకుండా సినిమా గురించి చెప్పడంతో అభిమానులు కాస్త నిరుత్సాహపడ్డారు. ఈ క్రమంలోనే తాజాగా మంచు లక్ష్మి తన కుటుంబంతో కలిసి శ్రీకాళహస్తికి వెళ్లి అక్కడ దేవున్ని దర్శించుకున్నట్లు తెలుస్తోంది.
స్వామివారి దర్శనం అనంతరం బయటికి వస్తున్న మంచు లక్ష్మి ను.. మనోజ్ రెండో పెళ్లి గురించి ప్రశ్నించడం జరిగింది. మంచు మనోజ్ రెండో పెళ్లి ఎప్పుడు చేసుకోబోతున్నారు అనే ప్రశ్న..మంచు లక్ష్మి కి వినిపించడంతో ఈ సందర్భంగా మంచు లక్ష్మి మాట్లాడుతూ.. నేను కుటుంబంతో ఇలా గుడికి వచ్చినప్పుడు మీరు పర్సనల్ విషయాలను అడగడం ఎంతవరకు కరెక్ట్? మనోజ్ పెళ్లి గురించి నన్ను అడిగే బదులు తననే అడగండి నా సినిమాల గురించి అడిగితే నేను చెబుతాను ప్రస్తుతం నేను నటించిన అగ్ని నక్షత్రం సినిమా మరో నాలుగు సినిమాలు విడుదలకు సిద్ధంగా ఉన్నాయని తెలిపింది. నా పరిధిలో ఉన్న విషయాలను అడిగితే నేను చెబుతాను ఇతర విషయాల నేను చెప్పలేనంటు తెలియజేసింది.