ఎన్టీఆర్ వచ్చిన లాభం లేదంటే షాకింగ్ కామెంట్లు చేసిన లక్ష్మీపార్వతి..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రాజకీయాలకు దూరంగా ఉంటూ కేవలం సినిమాలతో తన కుటుంబంతో ఎక్కువగా కాలాన్ని గడుపుతూ ఉన్నారు. ఇక అభిమానులు కూడా ఎన్టీఆర్ ఏదో ఒక రోజు సీఎం అవుతారని తాతకు తగ్గ మనవడుగ పేరు సంపాదించుకుంటారని అభిమానులు కోరుకుంటున్నారు.అయితే తారక్ పొలిటికల్ ఎంట్రీ గురించి తాజాగా లక్ష్మీపార్వతి మరొక వివాదాస్పందమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. దీంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారుతోంది ఈ విషయం.

Jr. NTR should take over Telugu Desam Party: Lakshmi Parvathi

ప్రస్తుతం టిడిపిలోకి జూనియర్ ఎన్టీఆర్ వచ్చిన లాభం లేదని లక్ష్మీపార్వతి తెలుపుతోంది. సీఎం జగన్ లా ఐదేళ్లపాటు ప్రజలలో ఉంటే మాత్రమే ఉండవచ్చని ఆమె తెలియజేసింది. ఐదేళ్లపాటు పూర్తిస్థాయిలో రాజకీయ శిక్షణ పొందాల్సిన అవసరమైతే ఉందని తన మనసులో అభిప్రాయంగా ఇతని తెలిపింది లక్ష్మీపార్వతి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో టిడిపి బ్రతికించే సత్తా ఉన్న వ్యక్తి ఎన్టీఆర్ మాత్రమే అని తెలిపింది. కొంతమంది సోషల్ మీడియా వేదికగా కుటుంబానికి అవసరం అనుకుని వాడుకొని వదిలేస్తున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నారు.

గతంలో బాలయ్య కూడా టిడిపిలోకి జూనియర్ ఎన్టీఆర్ ఎంట్రీ పార్టీకి ప్లస్ కావచ్చు మైనస్ కూడా కావచ్చు అనే విధంగా కామెంట్లు చేశారని తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ మాత్రం పొలిటికల్ ఎంట్రీ కి సంబంధించి ఇప్పటివరకు ఏ విధంగా నోరు మెదపలేదు. జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటించడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. వచ్చే నెల ఎన్టీఆర్ 30వ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించిన ఎన్టీఆర్ ప్రస్తుతం పూర్తి విభిన్నమైన కథలను ఎంచుకొని ముందుకు వెళుతున్నారు. మరి ఎన్టీఆర్ రాజకీయాలలోకి ఎప్పుడు ఎంట్రీ ఇస్తారో చూడాలి.

Share.