లక్ష్య మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ రిలీజ్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

యువ హీరో నాగ శౌర్య, డైరెక్టర్ ధీరేంద్ర సంతోష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ డ్రామా చిత్రం లక్ష్య. ఈ మూవీ ఆర్చరీ బ్యాక్ డ్రాప్ లో సాలిడ్ ఎమోషన్ తో తెరకెక్కించడం జరుగుతోంది. ఇక ఈ సినిమా నుంచి రీసెంట్ గా ట్రైలర్ విడుదలై బాగా ఆకట్టుకుంది. అయితే మరి ఇప్పుడు ఈ చిత్రం నుంచి మరొక ఆసక్తికరంగా ఒక సాంగ్ ని విడుదల చేసారు చిత్ర యూనిట్ సభ్యులు.

ఈ సినిమాలో కొన్ని లిరికల్, మరికొన్ని విజువల్స్ తో చూడడానికి చాలా బాగుంటుందని తెలియజేస్తున్నారు చిత్ర యూనిట్ సభ్యులు. ఈ సినిమాలో నాగశౌర్య సరసన కేతిక హీరోయిన్గా నటిస్తోంది. ఇక వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరిందని ట్రైలర్ చూస్తే కనిపిస్తుంది. ఈ సినిమాకి సంగీత దర్శకుడు కాలభైరవ ట్యూన్. మొత్తానికి ఈ సినిమాతో అయినా హీరో నాగశౌర్య సక్సెస్ అందుకుంటాడు ఏమో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. హీరో నాగ శౌర్య ఈ సినిమా అయినా సక్సెస్ కావాలని కోరుకుందాం.

Share.