దాదాపు 5 ఏళ్ల క్రితం మొదలైన మీటూ ఉద్యమం వల్ల ఎంతో మంది నటిమణులు తమ జీవితంలో కొత్త వెలుగును చూస్తున్నారు. ఈ మీటూ వల్ల సినీ ఇండస్ట్రీలో ఉండే నటీమణుల పైన జరిగే లైంగిక వేధింపుల కేసు విషయాలు కాస్త తగ్గాయని చెప్పవచ్చు. దీని కారణంగా ఎంతో మంది హీరోయిన్స్ తమ తమ బాధలను మీడియా ముందుకు వచ్చి వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఇలాంటి విషయంపై ఎప్పుడు ఎవరు ఏం మాట్లాడతారో తెలియక సినీ ఇండస్ట్రీలో భయం భయం గా ఉంటున్నారు. ఇకపోతే హీరోలు కూడా ఈ విషయంలో భయపెడుతున్న విషయం తెలిసిందే. స్టార్ హీరో అర్జున్ కూడా ఈ లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్నాడు.
మూడేళ్ల క్రితం అర్జున్ పై ఒక లైంగిక వేధింపు కేసులో హీరోయిన్ శృతి హరిహరన్ కేసు వేసింది. అయితే ఈ కేసుపై హీరో హాజరు కావాల్సి ఉండగా.. హీరోయిన్ శృతి తెలుపుతూ షూటింగ్ పేరుతో అర్జున్ తన ఒంటిపై చేతులు వేశారని ఆమె దీంతో చాలా ఇబ్బంది పడ్డాను అంటూ ఆ కేసులో ఆరోపించింది. అంతే కాకుండా షూటింగ్ వంటి పేరుతో ఎన్నో సార్లు తనను వేధించారని ఆమె ఎఫ్ఐఆర్లో పేర్కొంది. అయితే ఈ కేసును కోర్టు పరిశీలించిన అనంతరం సాక్ష్యాలు లేకపోవడంతో పోలీసులు కేసు కొట్టి వేయడం గమనార్హం.
ఇక హీరోయిన్ శృతి హరిహరన్ తన వద్ద ఎటువంటి సాక్ష్యాలు లేకపోయినా అర్జున్ పై ఫిర్యాదు చేసింది అంటూ పోలీసులు తెలియజేశారు. అయితే తాజాగా ఆయన నిర్దోషిగా బయటపడటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఆయన అభిమానులు.