లాభాల బాట పట్టిన కురుప్ మూవీ.. ఎన్ని కోట్లు అంటే..?

Google+ Pinterest LinkedIn Tumblr +

మలయాళం మెగాస్టార్ హీరోగా గుర్తింపు పొందిన మమ్ముట్టి తనయుడు దుల్కర్ సల్మాన్ తాజాగా నటించిన చిత్రం కురుప్..కేరళ రాష్ట్రానికి చెందిన క్రిమినల్ సుకుమార కురుప్ జీవిత కథ ఆధారంగా , ఈ సినిమాని చక్కగా తెరకెక్కించారు ప్రముఖ దర్శకుడు శ్రీనాథ్ రాజేంద్రన్. ఇక ఈ సినిమాకు నిర్మాతలుగా వేఫేరర్ ఫిల్మ్స్ బ్యానర్ పై స్వయంగా దుల్కర్ సల్మాన్ నిర్మిస్తున్నారు.నవంబర్ 12వ తేదీన విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులలో మంచి పాజిటివ్ టాక్ ను సంపాదించుకుంది. అంతేకాదు ఈ సినిమా విడుదలైన మూడు రోజులకే బ్రేక్ ఈవెన్ సంపాదించి క్లీన్ హిట్ గా నిలిచింది.. ఈ సినిమా కలెక్షన్ల విషయానికి వస్తే..

1.నైజాంలో రూ.0.89 కోట్లు
2.సీడెడ్ రూ.0.35 కోట్లు
3.ఆంధ్ర రూ.0.66 కోట్లు
4. ఆంధ్ర + తెలంగాణా – రూ.1.90 కోట్లు.

ఇకపోతే ఈ సినిమా కేవలం 200 థియేటర్లలో మాత్రమే రిలీజ్ అయినప్పటికీ మొదటి వారం పూర్తయ్యే సరికి ఏకంగా రూ.1.9 కోట్లు రాబట్టిన ఆల్మోస్ట్ బ్రేక్ ఈవెన్ ను కంప్లీట్ చేసుకోవడమే కాకుండా బయ్యర్లకు రూ.1.20 కోట్ల రూపాయల వరకు లాభాలను అందించింది.. అంతేకాదు ఇప్పటి వరకు నవంబర్ నెలలో వన్ వీక్ లోనే హిట్ గా నిలిచిన ఏకైక సినిమాగా కురుప్ సినిమా నిలవడం గమనార్హం.

Share.