కుష్భూ అంటే ఇప్పటి తరానికి పెద్దగా తెలియక పోవచ్చేమో గానీ ఎనభైలు తొంబైలలో మాత్రం తాను అగ్ర కథానాయికగా చక్రం తిప్పింది. అయితే సినిమాలు చేసిన తర్వాత చివరకు దర్శకుడు సుందర్.సి ని మ్యారేజ్ చేసుకుని లైఫ్ లో సెటిలైంది ఈ హీరోయిన్. కాగా వీరికి ఇద్దరు కుమార్తెలు అవంతిక, ఆనందిత ఉన్నారన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈమె సీనియర్ నటిగా చాలా బిజీగానే ఉంటున్నారు. ఈమె కెరీర్ స్టార్టింగ్ లో విక్టరీ వెంకటేష్, నాగార్జున మెగాస్టార్ లాంటి హీరోలతో బాగానే నటించింది. ఇక ఆ తర్వాత తన సినిమా కెరీర్ కు గుడ్ బై చెప్పి ఆ తర్వాత రాజకీయాల్లో ఉన్నారు.
ఇప్పుడు ఆమె బీజేపీ మహిళా నాయకురాలిగా తమిళనాడులో కీలక బాధ్యతల్ని తన భుజాన వేసుకున్నారు. ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఆమె రీఎంట్రీ ఇచ్చి బాగానే అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు ఆమె శర్వానంద్ ఆడాళ్లు మీకు జోహార్లు లాంటి మూవీలో కీలక పాత్రను పోషిస్తున్నారు కుష్భూ. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు ఆమె. ఇప్పుడు ఆమె లుక్ కి సంంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. యాభై నుంచి ఇరవైకి మారినట్టు అవి ఉన్నాయి. ఆమె అంత టూమచ్ గా ఎలా స్లిమ్ అయ్యారు అంటూ కామెంట్లు పెడుతున్నారు.