సమంత.. తన భర్తతో విడాకులు తీసుకున్న తరువాత ఒక రేంజ్ లో గ్లామర్ షో ప్రదర్శిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఐటం సాంగులో నటించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసిన ఈ ముద్దుగుమ్మ..తాజాగా హాట్ బికినీ ట్రీట్ ఇచ్చి కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. ఇక సమంత షేర్ చేసిన ఈ బికినీ ఫోటోలు చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. అంతేకాదు ఇన్ని అందాలను ఎందుకు దాచుకున్నావు అంటూ కూడా ఆమెను ప్రశ్నిస్తూ ఉండడం గమనార్హం.
ఇక ఆ ఫోటోలకు ఆమె గోవా యూ బ్యూటీ అనే హ్యాష్ ట్యాగ్ ను కూడా జోడించింది.ఈ ఫొటోని బట్టి అమ్మడు గోవాలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెతో పాటు ప్రముఖ డిజైనర్ శిల్పా రెడ్డి, మోడల్ వాసుకి పుంజ్ కూడా ఉన్నారు. వీరందరూ కలిసి గోవాకి హాలిడేకు వెళ్లారు. చూస్తుంటే న్యూఇయర్ సెలబ్రేషన్స్ కూడా అక్కడే ప్లాన్ చేసినట్లు ఉన్నారు. తన భర్తతో విడిపోయిన తరువాత సమంత ఎక్కువగా తన స్నేహితులతోనే సమయం గడుపుతోంది. గతంలో ఇదే బ్యాచ్ తో కలిసి చార్ ధామ్ యాత్రకు వెళ్లింది సామ్. తన జీవితంలో వచ్చిన మార్పులను అడ్జస్ట్ చేసుకోవడానికి సమంత తనను తాను చాలా బిజీగా ఉంచుకుంటుంది. హాలిడే ట్రిప్ లు, సినిమాలంటూ గ్యాప్ లేకుండా గడుపుతోంది.