ఉప్పెన సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ కృతి శెట్టి.మొదటి సినిమాతోనే బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత నానితో కలిసి శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు వంటి సినిమాలతో వరుస విజయాలను అందుకుంది. దీంతో కృతి శెట్టి వరుసగా ఆఫర్లు క్యూ కట్టాయి ఇమే దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్క సినిమాను కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తోంది. మొదట సినిమాకి రూ .6లక్షల రూపాయలు రెమ్యూనరేషన్ అందుకున్న ఈ ముద్దుగుమ్మ రెండవ సినిమాకి రూ.60 లక్షల రూపాయలు డిమాండ్ చేసింది. ఆ తర్వాత ఒకేసారి వరుసగా విజయాలు అందడంతో కోటి రూపాయలు అందుకునే హీరోయిన్గా మారిపోయింది.
ఇక నితిన్ నటించిన యాచర్ల నియోజవర్గం, రామ్ దివారియర్ చిత్రాలకు కోటి రూపాయలు అందుకున్నట్లు సమాచారం. ప్రస్తుతం నాగచైతన్య కస్టడీ సినిమాకు కూడా అంతే తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈమె గత సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవడంతో.. ఈమె డిమాండ్ మరింత తగ్గిపోయింది.ఇదే టైంలో శ్రీలిలా క్రేజ్ పెరగడంతో వరుసగా ఆమె బ్యాక్ టు బ్యాక్ వరుస విజయాలను అందుకుంటు దూసుకుపోతోంది. దీంతో శ్రీలీలా వరుసగా క్రేజీ ఆఫర్లను అందుకుంటోంది.
ప్రస్తుతం కృతి శెట్టి తో శర్వానంద్ హీరోగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు నిర్మిస్తున్నారు ఈ సినిమా కోసం కృతీ శెట్టి రూ.60 లక్షల రూపాయలు అందుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కృతి శెట్టి రెమ్యూనరేషన్ తగ్గించుకోవడం పై తన రాబోయే చిత్రాలు హిట్ అయితే మళ్లీ పుంజుకొని అవకాశం ఉంది లేకపోతే ఇక కష్టమే అని చెప్పవచ్చు.