కోలీవుడ్ స్టార్ హీరో తో కృతి శెట్టి పెళ్లి.. అసలు విషయం అదే..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ ఇండస్ట్రీకి ఉప్పెన సినిమాతో రాత్రికి రాత్రే స్టార్ హీరోయిన్ పొజిషన్లో దక్కించుకున్న హీరోయిన్ కృతి శెట్టి ఆ తరువాత వెంట వెంటనే పలు సినిమాలలో నటించింది. అయితే బంగార్రాజు చిత్రంతో తన ఖాతాలో రెండో హిట్ ను దక్కించుకుంది. కానీ బంగార్రాజు తర్వాత మళ్లీ ఆమె హిట్ ముఖమే చూడలేదు.. వరుసగా వచ్చిన సినిమాలన్నీ అట్టర్ ప్లాపులు కావటం ఆమె దురదృష్టం

Krithi Shetty - IMDb

దాంతో కృతి శెట్టి వేరే భాషల వైపు మొగ్గు చూపింది. ఇటు తెలుగులో అటు తమిళం మలయాళం సినీ పరిశ్రమలో బిజీ హీరోయిన్స్ గా మారిపోయిందిఈ ముద్దుగుమ్మ .ఇదిలా ఉంటే తాజాగా కృతి శెట్టి సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ వైరల్ గా మారుతోంది ..అదేంటంటే.. కోలీవుడ్ స్టార్ హీరోకు కృతి శెట్టి కోడలు కాబోతోందట. అయితే రియల్ గా కాదండోయ్.. తెరమీద మాత్రమే తెలుగులో అయితే కృతి శెట్టి ఒకే ఒక సినిమాకు సైన్ చేసింది.. అది శర్వానంద్ హీరోగా శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఈ మూవీ తెరకెక్కపోతోంది.

బేబీ ఆన్ బోర్డ్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మితమవుతున్న ఈ చిత్రంలో శర్వానంద్ కు తండ్రిగా ఓ కోలీవుడ్ హీరో నటించబోతున్నాడు. ఆ హీరో మరెవరో కాదు విజయ్ సేతుపతి ఇప్పటికే ఆయనకు స్టోరీ నచ్చటం ఆ సినిమాను ఒప్పుకోవటం కూడా జరిగింది. ఈ మూవీలో విజయ్ సేతుపతి పాత్ర చాలా కీలకమైనది.. శర్వానంద్ కు విజయ్ సేతుపతి తండ్రిగా నటిస్తున్నాడు కృతి శెట్టి మామగా కనబడబోతున్నాడు. గతంలో ఉప్పెన సినిమాలో తండ్రి పాత్రలో పోషించిన విజయ్ సేతుపతి ఇప్పుడు మామగా అలరించబోతున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.

Share.