Kriti Shetty..తెలుగు చలనచిత్ర పరిశ్రమలు సినిమాతో అడుగుపెట్టి మొదటి సినిమాతోనే భారీ విజయాన్ని సొంతం చేసుకున్న కృతి శెట్టి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. మెగా హీరో వైష్ణవ్ తేజ్ సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే భారీ విజయం సొంతం చేసుకుని ఆ తర్వాత రెండు సినిమాలతో కూడా సక్సెస్ పొంది హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది. కానీ సరైన కథల ఎంపిక విషయంలో ఆలోచన లేక తప్పటడుగులు వేసి ఇండస్ట్రీకి దూరమయ్యే పరిస్థితి తెచ్చుకుంది. ఇదిలా ఉండగా కృతి శెట్టి (Kriti Shetty) తన మొదటి సినిమా సమయంలో మెగా హీరో వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) ను అవమానపరిచినట్లు సమాచారం.అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
మెగా కాంపౌండ్ నుండి 2021లో ఉప్పెన సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చారు హీరో వైష్ణవ్ తేజ్ . ఈయన ప్రతి ఒక్కరికి సుపరిచితుడే.. ఆ తర్వాత కొండపొలం వంటి సినిమాలతో కూడా ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యారు. చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా కావడంతో మెగా అభిమానులు కూడా భారీగా సినిమాకు మద్దతు పలికారు. దీంతో ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా వైష్ణవ్ తేజ్ ఉప్పెన సినిమాలో చాలా మాస్ గా కనిపించినా కూడా అందరి అభిమానాన్ని సంపాదించుకున్నాడు ఈ యంగ్ హీరో.
ఇదిలా ఉండగా కృతి శెట్టి ఈ సినిమాలోనే వైష్ణవ్ తేజ్ ను అవమానపరిచినట్లు తెలుస్తోంది. అసలు విషయంలోకి వెళితే ఈ సినిమాలో హీరోయిన్ కృతి శెట్టి హీరోను చాలా రొమాంటిక్గా లిప్ లాక్ కిస్ చేసుకున్న సన్నివేశాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఆ షార్ట్ అయిపోయిన వెంటనే మెగా హీరో వైష్ణవ్ తేజ్ ముందే ఈ ముద్దుగుమ్మ తన పెదాలను సోప్ తో కడిగేసుకుందట. ఇది చూసి ఆయన చాలా బాధపడ్డారని సమాచారం. అయితే ఆ సమయంలో కృతి శెట్టి తన పెదాలకు సంబంధించిన ఇన్ఫెక్షన్ తో బాధపడుతుండడం వల్లే ఆమె అలా చేసిందని తెలుస్తోంది.
నిజానికి వైష్ణవ్ తేజ్ ముందే తాను అలా చేయడం వల్ల ఆయన బాగా హర్ట్ అయినట్లు సమాచారం. ఏదేమైనా తన సమస్యను మరింత పెంచడం ఇష్టం లేక అలా చేసింది అంటూ కృతి శెట్టి అభిమానులు ఆమెకు మద్దతు పలుకుతున్నారు.