ప్రస్తుతం కృతి శెట్టి చేతిలో నాగచైతన్య కస్టడీ సినిమా మినహా మరే సినిమాలో నటించడం లేదు. గతంలో ఉప్పెన సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన కృతి శెట్టి వరుసగా విజయాలు అందుకుంటూ హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకొని.. గోల్డెన్ లెగ్ అనిపించుకుంది. కానీ ఏమైందో తెలియదు కథల ఎంపిక విషయంలో తడబాటు పడ్డ ఈమె హ్యాట్రిక్ డిజాస్టర్ ను చూసింది దీనితో ఇక ఈమె కెరియర్ ముగిసిపోయిందంటూ అంతా అనుకున్నారు. అయితే ఆమె మాత్రం అవకాశాలు లేకపోతేనేమీ గ్లామర్ షో తో ప్రేక్షకులను ఆకట్టుకుంటా అంటూ తెగ సందడి చేస్తోంది. ఈ మధ్యకాలంలో వరుసగా గ్లామర్ ఫోటోషూట్లను వదులుతూ నెట్టింట రచ్చ చేస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు తమిళంలో కూడా సూర్యకి జోడిగా ఒక సినిమాలో నటించడానికి ఒప్పుకుంది.. కానీ ఏమైందో తెలియదు కానీ మళ్ళీ ఆమెను ఆ సినిమా నుంచి తప్పించినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం ఈమె ఆశలన్నీ నాగచైతన్య కస్టడీ మూవీ పైనే ఉన్నాయి . ఈ మూవీ సక్సెస్ అయితే మళ్లీ హీరోయిన్గా ఈమెకు అవకాశాలు పెరుగుతాయని భావిస్తోంది. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా సైలెంట్ గా ఉన్న కృతి శెట్టి మళ్ళీ సోషల్ మీడియాలో యాక్టివ్ అయింది. అందాల భామలు సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉన్న గ్లామర్ షో విషయంలో మాత్రం ఏ మాత్రం రాజీపడరు. గ్లామర్ షో లో ఇతర హీరోయిన్లతో పోటీ పడుతూ ఎప్పటికప్పుడు అందాల ఆరబోతతో యువతను పిచ్చెక్కిస్తూ ఉంటారు.
ఈ క్రమంలోనే కృతి శెట్టి కూడా బ్లాక్ డ్రెస్ మినీ టైట్ ఫిట్ డ్రెస్ లో హాట్ హాట్ గా ఫోటోలకు ఫోజులిస్తూ రెచ్చిపోయింది. థైస్ అందాలు చూపిస్తూ.. తాపం పెంచేసింది. థైస్ అందాలతో మెరిసిపోతున్న కృతి శెట్టి ఫోటోలను ఇంస్టాగ్రామ్ లో ఏకంగా 7.5 లక్షలకు పైగా లైక్స్ చేయడం విశేషం. వీటిని చూస్తే ఆమె గ్లామర్ ఎంత మందికి రీచ్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు.