టాలీవుడ్ లో ఈమధ్య కొత్త కొత్త హీరోయిన్లు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. గడిచిన రెండు సంవత్సరాల క్రితం ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ కృతి శెట్టి.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది..ఆ తరువాత అగ్ర హీరోల సరసన నటించి ఇంకాస్త క్రేజ్ ను సొంతం చేసుకుంది.. అలా మొదట మూడు సినిమాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకుంది. కానీ ఆ తర్వాత నటించిన సినిమాలన్నీ ప్లాపులను మూట కట్టుకున్నాయి.
ఈ ఫ్లాపుల కారణంగా ఆమెకి సినిమా అవకాశాలు తగ్గాయని వార్తలు వినిపించాయి.. కానీ ఆమెకి ఈమధ్య కొత్త సినిమా ఆఫర్స్ వస్తున్నాయని అభిమానులు తెలియజేస్తున్నారు. తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం..ఒక సినిమాలో కృతి శెట్టి బికినీలో కనిపించబోతొందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకి కృతి శెట్టి రూ.4 కోట్లు డిమాండ్ చేస్తోందని సమాచారం. నాగచైతన్య, కృతి శెట్టి కాంబినేషన్లో వచ్చిన బంగార్రాజు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో కస్టడీ సినిమా మే – 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. కృతి శెట్టికి ఎక్కువ ఆఫర్లు కథ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తోందని సమాచారం.అలాగే ఈమెకి గట్టి పోటీ ఇచ్చే హీరోయిన్లు ఇండస్ట్రీలో ఉన్నారని కృతి శెట్టికి ఆఫర్లు ఇవ్వటానికి డైరెక్టర్లు స్టార్ హీరోలు జంకుతున్నారని తెలుస్తోంది.
అయితే కృతి శెట్టికి వ చ్చే ఆఫర్లన్నీ శ్రీ లీల దక్కించుకుంటోందని అలాగే శ్రీ లీల పారతోషకం కూడా పెరిగిపోతోందని ..తన డాన్స్ తో అలాగే తన ఎక్స్ప్రెషన్ తో అందరిని మెస్మరైజ్ చేస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా అగ్ర హీరోల సరసన నటించే అవకాశాలను సైతం అందుకుంటోంది. మరి ఈసారైనా కృతి శెట్టి సరైన కథలు ఎంపిక చేసుకొని తాను కూడా స్టార్ హీరోల సరసన నటిస్తుందేమో చూడాలి మరి.