టాలీవుడ్లోకి ఉప్పెన సినిమాతో పరిచయమైన బ్యూటీ కృతి శెట్టి.. ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఉప్పెన సినిమా ద్వారా మంచి హిట్ ను సాధించిన ఈ అమ్మడు ఆ తరువాత నటించిన సినిమాలు పెద్దగా పేరును తెచ్చి పెట్టలేదు..ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన కృతి దెబ్బకు రాత్రికి రాత్రే స్టార్డం హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.తన వయసుకు తగ్గట్టు ఉన్న పాత్రలో కృతిశెట్టి చాలా సహజంగా కనిపించింది. ఇక నాని నటించిన శ్యామ్ సింగ రాయ్ మూవీతో సెకండ్ హిట్ తన ఖాతాలో వేసుకుంది.
అయితే ఆ సినిమాలో ఒకింత హద్దులు దాటి బోల్డ్ సన్నివేశాల్లో నటించారు. ఆ సినిమాలో లిప్ లాక్ ఇవ్వటంతో పాటు బెడ్ సీన్స్ లో నటించింది. ఆ తరువాత నాగచైతన్యతో నటించిన బంగార్రాజు సినిమాతో ఒక హ్యాట్రిక్ ను పూర్తి చేసుకుంది. వరుసగా మూడు హిట్ చిత్రాలతో నటించిన హీరోయిన్ రికార్డులకు ఎక్కింది. దొరికిన ఆఫర్లన్నింటిని కృతి శెట్టి చాలా బాగా వినియోగించుకుంది.
ఇప్పుడు కృతి శెట్టి కూడా స్క్రీన్ షో చేస్తు పొట్టి బట్టలతో హాట్ గా కనిపిస్తోంది .తాజాగా కృతి శెట్టి షార్ట్ ఫ్రాక్ ధరించి క్రేజీ ఫోటో షూట్ చేసింది. కృతి శెట్టి కి మరో హీరోయిన్ శ్రీ లీల నుండి కాంపిటీషన్ ఎదుర్కొంటోంది. శ్రీ లీల ఇండస్ట్రీకి వచ్చాక కృతికి ఆఫర్లు తగ్గుముఖం పట్టాయి. గత ఏడాది నుంచి ఆమెకి ఫ్లాపులే మిగులుతున్నాయి. దీంతో రేసులో వెనకబడింది కృతి శెట్టి.. సినిమా అవకాశాలు లేకపోవడంతో ఇలా గ్లామర్ షో చేస్తూ అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం చేస్తున్న సినిమాలు విషయానికొస్తే ఒకే ఒక చిత్రం శర్వానంద్ ఒక సినిమాలో నటిస్తోంది. మరో కొత్త ప్రాజెక్టుకు ఆమె సైన్ చేయలేదు..తమిళంలో రెండు చిత్రాలు చేస్తున్నట్టు సమాచారం .ఈ సినిమాలన్న ఆమెకు మంచి హిట్ గా నిలుస్తాయేమో చూడాలి.
View this post on Instagram