KRITISANAN:తెలుగు సినీ ప్రేక్షకులకు హీరోయిన్ కృతి సనన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మొదట మహేష్ బాబు తో కలిసి నేనొక్కడినే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ మద్దుగుమ్మ ఆ తర్వాత నాగచైతన్య తో దోచేయ్ సినిమాలో నటించింది. ఇక తర్వాత మరే తెలుగు సినిమాలో నటించలేదు. కేవలం బాలీవుడ్ లో తన ఫోకస్ పెట్టి అక్కడే పలు చిత్రాలలో నటిస్తూ ఉంటోంది. అక్కడ కూడా స్టార్ హీరోయిన్గా బాగానే పేరు సంపాదించింది. ప్రస్తుతం ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమాలో సీత పాత్రలో నటిస్తోంది. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్లో విడుదలకు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.
కృతి సనన్ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్గానే ఉంటుంది. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. ఇదంతా ఇలా ఉండగా కృతి , ప్రభాస్ మధ్య గత కొన్ని రోజులుగా డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నా కృతి సనన్ పలు విషయాలను తెలియజేసింది. ఈ నేపథ్యంలో తన వివాహం చేసుకోబోయే వాడి గురించి కూడా పలు క్వాలిటీస్ ఉండాలని తెలియజేసింది. ఈ సందర్భంగా కృతి సనన్ మాట్లాడుతూ చిన్నప్పుడు ప్రేమంటే తనకి అసలు తెలియని వయసులో కూడా చాలానే క్రష్ లు ఉన్నాయని తెలియజేసింది.
నేను కూడా రెండు మూడుసార్లు ఆ అనుభూతిని విహరించాను..కానీ అప్పట్లో చాలా భయమేసిందని తెలియజేసింది. ఎవరితోనూ పెద్దగా మాట్లాడేదాన్ని కాదు నేను ఇష్టపడిన అబ్బాయిల దగ్గర మాత్రమే నోరు మెదపడానికి ఎక్కువగా ఇష్టపడతారని తెలియజేసింది. అయితే అప్పటి మూమెంట్స్ అన్నీ కూడా నాకు బాగా గుర్తు ఉన్నాయి.. తనకు కాబోయే వాడు ఎలా ఉండాలి అన్నదానిపై స్పష్టమైన అవగాహన ఉంది.. ముఖ్యంగా తనకు కాబోయే వారు తనకంటే హైటుగా ఉండాలి అందంగా ఉండాలి మంచి మాటల కారై ఉండాలని తెలియజేస్తుంది కృతి సనన్.
అంతేకాకుండా ఎప్పుడూ తనకి బోర్ కొట్టకుండా చూసుకోవాలని తెలియజేస్తోంది.ఇలాంటి లక్షణాలు ఉన్న వారే తనకు భర్తగా రావాలని తెలియజేస్తోంది కృతి సనన్. ప్రస్తుతం కృతి చేసిన ఈ కామెంట్లు సైతం వైరల్ గా మారుతున్నాయి. మరి త్వరలోనే పెళ్లి విషయం తెలియజేస్తుందేమో చూడాలి మరి.