కృష్ణవంశీ – బండ్ల గణేష్ – రుద్రాక్ష

Google+ Pinterest LinkedIn Tumblr +

టాలీవుడ్ లో ప్రస్తుతం టాప్ డైరెక్టర్లలో ఒకరు కృష్ణవంశీ. క్రియోటివ్ డైరెక్టర్గా పేరున్న కృష్ణవంశీ సినిమాకు చాలా కాలం క్రితమే అనధికార విరామం ప్రకటించాడు. చాలా రోజుల తరువాత కృష్ణవంశీ మెగాఫోన్ పట్టుకునేందుకు సిద్ధమయ్యాడట. త్వరలో దర్శకత్వ బాధ్యతలు మళ్ళీ అందుకోబోతున్న కృష్ణవంశీ నిర్మాత బండ్ల గణేష్తో జతకట్టబోతున్నాడట.

ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ సినిమాలకు విరామం ప్రకటించి కాంగ్రెస్లో చేరారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే చక్రం తిప్పొచ్చని అనుకున్న గణేష్కు అది తీరని నిరాశనే మిగల్చింది. కాంగ్రేస్ ఎన్నికల్లో చావుదెబ్బ తినడంతో ఏమి చేయలేని స్థితిలో మళ్ళీ తన ప్రయాణంను సినిమాలతోనే సాగించాలనే నిర్ణయానికి వచ్చాడట. అందులో భాగంగా కృష్ణవంశీతో సినిమాను నిర్మించాలని నిర్ణయించారు. గతంలో కృష్ణవంశీతో కలిసి మెగా పవర్స్టార్ రామ్చరణ్ హీరోగా గోవిందుడు అందరి వాడేలే అనే హిట్ చిత్రాన్ని నిర్మించాడు.

ఇక ఇప్పుడు ఇద్దరి కాంబినేషన్లో రుద్రాక్ష అనే సినిమా టైటిల్తో ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే రుద్రాక్ష సినిమాను చేసేందుకు బండ్ల గణేష్తో కృష్ణవంశీ చర్చలు సఫలం కావడంతో త్వరలో ప్రొడక్షన్ పనులను ప్రారంభించనున్నారట. ఈ సినిమాను లేడి ఓరియెంటెడ్ చిత్రంగా రూపొందించబోతున్నారు. ప్రముఖ నిర్మాత దిల్రాజు ఈ స్క్రిప్ట్ విని మంచిగుందని మెచ్చుకున్నాడట. త్వరలో నటీనటులను, సాంకేతిక నిపుణులను ఎంపిక చేయనున్నారట.

Share.