తెలుగు సినీ ఇండస్ట్రీలో కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నటువంటి వారిలో కొవై సరళ కూడ ఒకరు. ఈమె గురించి తెలియని వారంటూ ఎవ్వరు ఉండరు. ఒకప్పుడు కోవై సరళ, బ్రహ్మానందం కలిసి నటించిన సినిమాలు ఎన్నో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించాయి..వీరిద్దరి కాంబినేషన్ చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంటుంది. ఈమె 1979లో వెళ్లి రత్నం అనే సినిమా ద్వారా పరిచయమయ్యింది. ఆ తరువాత సినిమా అవకాశాలు ఆమెను వెతుక్కుంటూ వచ్చాయి. ఈమె తెలుగులోనే కాకుండా తమిళ్ భాషలో కూడా నటించి అక్కడ కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది. అంతేకాక బాగా ఆస్తులను కూడా కూడబెట్టుకుంది. సినీ విషయాలు పక్కన పెడితే
కోవై సరళ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే ఇప్పటికీ కోవై సరళ పెళ్లి చేసుకోకుండా ఒంటరి జీవితాన్ని గడుపుతున్నారు. అయితే ఈమె పెళ్లి చేసుకోకపోవటానికి ఒక కారణం ఉందట..అదేంటంటే చిన్నప్పుడే తన కుటుంబ బాధ్యతలను తన భుజాలపై వేసుకుంది కోవై సరళ..సినిమాల్లో నటిస్తూనే తన తోబుట్టువులను గొప్ప గొప్ప చదువులను చదివించి వారికి పెళ్లిలను చేసి విదేశాలకు వెళ్లేలా చేసింది. అయితే ఇండస్ట్రీలో కొనసాగుతూ సంపాదించినది మొత్తం వారి కోసమే ఖర్చు చేసిందట. అయితే ఉన్న ఆస్తులు కూడా వారికి వాటా కావాలి అంటూ తన తోబుట్టిన వారు ఆమె సంపాదించిన ఆస్తి విషయంలో కూడా కోర్టుకు వెళ్లారట.
వారికోసం వారి కుటుంబం కోసం ఎంతో కష్టపడినా కోవై సరళ ఆమె తోబుట్టువులు మంచి బహుమతి ఇచ్చారని ..ఎంతో కష్టపడి వారిని ఉన్నత స్థాయిలో నిలబెట్టిన కోవై సరళకి తోడబుట్టిన వారు మోసానికి పాల్పడుతూ చివరికి ఆస్తిలో కూడా వాటా కావాలి అంటూ కోర్టు మెట్లు ఎక్కడంతో తన జీవితం మీద తనకు విరక్తి పుట్టిందట. అప్పటినుంచి ఒంటరిగానే ఉండాలని డిసైడ్ అయ్యిందట.
అంతేకాకుండా వారికోసం తన జీవితాన్నే త్యాగం చేసిన కోవై సరళ కానీ వారు మాత్రం ఆస్తి కోసమే ఆశపడ్డారు. ఇప్పుడు ఆమెకు సినిమా అవకాశాలు లేక ఒంటరిగా జీవితాన్ని గడుపుతున్నది. అడపాదడపా సినిమాలలో లేడీ ఓరియంటెడ్ చిత్రాలలో నటిస్తోంది.