టాలీవుడ్ లో ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించిన నటులలో కోట శ్రీనివాసరావు గారు ఒకరిని చెప్పవచ్చు. గతంలో బ్రహ్మానందం, కోటా శ్రీనివాసరావు, బాబు మోహన్ వంటి వారు చేసే కామెడీ సినిమాలకు హైలైట్ గా నిలుస్తూ ఉండేది. అయితే వయసు మీరడంతో కోటా శ్రీనివాసరావు గారు ఈ మధ్యకాలంలో సినిమాలలో పెద్దగా కనిపించలేదు కేవలం ఇంటి పట్టునే ఉంటూ తమ కాలాన్ని గడిపేస్తున్నారు. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలామంది సెలబ్రిటీల విషయాలపై పలు రూమర్లు సృష్టిస్తూ ఉన్నారు.
దీంతో సోషల్ మీడియా వేదికగా మేము బతికే ఉన్నామంటూ చెప్పుకోవలసిన పరిస్థితి వచ్చింది నటీనటులకు. ఇదివరకే చాలామంది నటీనటుల విషయంలో ఇలాంటి తప్పే జరిగింది. తాజాగా సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు కూడా మరణించారు అంటూ సోషల్ మీడియాలో అసత్యపు వార్తలు ప్రచారం జరిగాయి దీంతో ఈ వార్తలపై నటుడు కోటా శ్రీనివాసరావు స్పందిస్తూ ఆవేదనను తెలియజేయడం జరిగింది. అలాగే ఒక వీడియోని కూడా విడుదల చేస్తూ మాట్లాడడం జరిగింది కోట శ్రీనివాసరావు.
కోట శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ నేను ఆరోగ్యంగానే ఉన్నాను ఎలాంటి ఇబ్బందులు లేవని తెలిపారు. అయితే తన గురించి సోషల్ మీడియాలో అసత్యపు వార్తలు రావడం చాలా బాధాకరంగా ఉంది. రేపటి ఉగాది పండుగ రోజున పనులను నిమగ్నమైన తనకు ఇలా విషయాలు చెప్పి అందరూ బాధ కలిగించారని..అలాగే చాలామంది కూడా తనకు ఫోన్ కాల్స్ చేస్తూ విసిగిస్తే చేస్తున్నారని తెలిపారు. ఒకేసారి కొంతమంది పోలీసులు బందోబస్తుగా తన ఇంటికి రావడం చాలా బాధనిపించిందని తెలిపారు కోటా శ్రీనివాసరావు.డబ్బు సంపాదించాలంటే చాలా మార్గాలు ఉన్నాయి అయితే ఇలా సంపాదించడం చాలా బాధాకరంగా ఉందని తెలిపారు. ప్రస్తుతం అందుకు సంబంధించి వీడియో వైరల్ గా మారుతోంది.