టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లలో కొరటాల శివ కూడా ఒకరు. గతంలో కొరటాల శివ తెరకెక్కించిన మిర్చి, శ్రీమంతుడు, భరత్ అనే నేను, జనతా గ్యారేజ్ సినిమాలు విడుదలై మంచి బ్లాక్ బస్టర్ విజయాలను అందుకున్నాయి. కానీ చిరంజీవి, రామ్ చరణ్ తో కలిసి ఆచార్య సినిమాని తెరకెక్కించగా ఒక్కసారిగా ఫ్లాప్ డైరెక్టర్ గా ముద్ర వేసుకున్నారు. ఈ సినిమా ఘోరమైన పరాజయాన్ని చవిచూడడంతో మెగా అభిమానులతో పాటు నెటిజెన్లు కూడా కొరటాల శివ పైన ట్రోల్ చేయడం జరిగింది.
ఇక దీంతో కొరటాల శివ తో సినిమా చేయాలంటే ఎంతో మంది నిర్మాతలు, హీరోలు సైతం భయపడుతున్నారు. అలాంటి సమయంలోనే ఎన్టీఆర్ తో కలిసి తన 30వ సినిమాని కొరటాల శివతో తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించడం జరిగింది. ఈ సినిమా ప్రకటించి ఇప్పటికీ కొన్ని నెలలు కావస్తున్న ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు. దీంతో గడిచిన రెండు రోజుల క్రితం ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించడంతో నందమూరి అభిమానులు కాస్త ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో పాత్రలు వంటివి ఇంకా తెలియజేయలేదు.
అయితే గతంలో కొరటాల శివ సినిమాల బిజినెస్ వ్యవహారంలో తల దూర్చి చాలా ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా ఆచార్య సినిమా విషయంలో ఈయన లెక్క తప్పిందని చెప్పవచ్చు. ఇప్పుడు ఎన్టీఆర్ -30 వ సినిమాకి కేవలం రెమ్యూనరేషన్ తీసుకొని సైడ్ అయిపోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ కొరటాల శివ సినిమాకి దాదాపుగా రూ.24 కోట్ల రూపాయలు అందుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కాబోతున్నట్లు ప్రకటించారు.