భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ చిక్కుల్లో పడ్డాడు. బెంగళూరులో దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో ప్రత్యర్థి పేసర్ భుజాన్ని కోహ్లీ ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టాడని నిర్ధారించిన ఐసీసీ, ఈ మేరకు చర్యలు తీసుకుంది. సఫారీల టీంతో జరుగుతున్న మూడు 20-20 వన్డేల సీరిస్‌లో భాగంగా బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మూడో వన్డే జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్‌పై దక్షిణాఫ్రికా విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఐదో ఓవర్లో పరుగు పూర్తి చేసే క్రమంలో సఫారీ బౌలర్ హెండ్రిక్స్‌ను విరాట్ ఢీకొట్టాడు. దీనిపై అంపైర్లు ఐసీసీకి ఫిర్యాదు చేశారు. కోహ్లీకి ఇది మూడో డీమెరిట్ పాయింట్.
ఈ క్రమంలోనే కోహ్లీ ఐసీసీ మందలింపునకు గురయ్యాడు. ఈ మ్యాచ్‌లో జరిగిన సంఘటన నేపథ్యంలో ఐసీసీ ప్రవర్తనా నియమావళిని అనుసరించి రిఫరీ రిచీ రిచర్డ్సన్ అతనికి ఒక డీమెరిట్ (అయోగ్యత) పాయింట్ ఇచ్చారు. 2020 జనవరి 15 లోపు కోహ్లీ ఖాతాలో మరో డీమెరిట్ పాయింట్ చేరితే అతడు కొన్ని మ్యాచ్‌లు ఆడకుండా నిషేధానికి గురికావాల్సి వస్తుంది.
ఏ ఆటగాడైనా రెండేళ్ల కాలంలో నాలుగు డీమెరిట్ పాయింట్లు పొందితే కొన్ని మ్యాచ్‌లు ఆడకుండా అతడిపై నిషేధం విధించవచ్చు. 2018లో దక్షిణాఫ్రికాతో టెస్టు సందర్భంగా, ఈ ఏడాది ప్రపంచకప్‌లో ఆఫ్ఘనిస్థాన్‌తో మ్యాచ్‌లో కోహ్లీ ఒక్కో డీమెరిట్ పాయింట్ పొందాడు. ఓ టెస్టు లేదా రెండు వన్డేలు లేదా రెండు టీ20ల నిషేధానికి సమానం. నాలుగు సస్పెన్షన్ పాయింట్ల తర్వాత నిర్ణీత మ్యాచ్‌లకు ఆ ఆటగాడు దూరం కావాల్సి ఉంటుంది.