టాలీవుడ్ ,బాలీవుడ్ లో కియారా అద్వాని ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ తెలుగులో మొదటిసారి మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రం ద్వారా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత రామ్ చరణ్ తో నటించిన పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. ఇక బాలీవుడ్లో పుగ్లి అనే సినిమాతో తన కెరీర్ ని మొదలు పెట్టింది కియారా. ప్రస్తుతం స్టార్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలుగుతోంది.
కబీర్ సింగ్, గుడ్ న్యూజ్, లవ్ స్టోరీస్ అంటే సినిమాలతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న కియారా ఇటీవలే నటుడు సిద్ధార్థ మల్హోత్రాన ప్రేమించి వివాహం చేసుకుంది. గతంలో కియారా రిలేషన్షిప్ విషయంపై పలు వార్తలు ఇప్పుడు ఫైనల్ గా మారుతున్నాయి. మొదట పుగ్లి సినిమాలో తనతో పాటే నటించిన మోహిత్‌తో కియారా కొన్నాళ్లపాటు డేటింగ్ చేసిందని వార్తలు వినిపించాయి. రెండేళ్లపాటు వెయిటింగ్ చేశారు కానీ తర్వాత బ్రేకప్ చెప్పుకున్నట్లు సమాచారం.
ఆ తర్వాత అబ్బాస్ మస్తాన్ దర్శకత్వంలో వచ్చిన మెషిన్ సినిమాలో ముస్తఫా మరియు కియారా అద్వాని నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరిపైన అనేక రకాలలో వార్తలు వినిపించాయి.
ఇక ఆ తర్వాత వరుణ్ ధావన్ కియారా అద్వానీ కలంక్ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా సమయంలో వీరిద్దరూ డేటింగ్ చేసినట్లుగా వార్తలు వినిపించాయి. మీడియా కంట బడిన తర్వాత ఈ జంట అనేక ఈవెంట్లలో కూడా కలిసి కనిపించారు. అయితే ఆ తర్వాత ఈ వార్తలను ఖండిస్తూ స్నేహితులమని తెలియజేశారు.
ఇక కోయారా ,సిద్ధార్థ మల్హోత్రాలతో షేర్షా సినిమా సమయంలో వీరిద్దరూ ప్రేమలో పడినట్లుగా వార్తలు వినిపించాయి సినిమా షూటింగ్ మొదలైన రోజు నుంచి ఈ జంటనుగా పేర్కొంది. ఇక గడిచిన కొద్ది రోజుల క్రితం మూడుముళ్ల బంధంతో ఒకటయ్యారు.