ముద్దుల యుద్దానికి మరో బాలీవుడ్ హీరోయిన్ సిద్ధం అయ్యింది. భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన హాట్ బ్యూటీ కియారా అద్వానీ ఒక సరికొత్త కధాంశంతో తెరకెక్కి సూపర్ డూపర్ హిట్ అయ్యి ఎన్నో వివాదాలకు ఆజ్యం పోసిన ‘ అర్జున్ రెడ్డి’ సినిమా బాలీవుడ్ రీమేక్ లో ఈ అమ్మడు తళుక్కుమనబోతోంది.
తనకు కథ నచ్చితే ఏమైనా చేస్తాను అనే సందేశాలు పంపిన ఈ భామ అందుకు తగ్గట్టుగానే ఈ సినిమాలో ముద్దుల యుద్ధానికి సిద్ధమైంది.
అర్జున్ రెడ్డి బాలీవుడ్ రీమేక్ కూడా సందీప్ రెడ్డి వంగానే డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ స్థానంలో షాహిద్ కపూర్ నటిస్తున్నాడు. ఇక కియారా అద్వానీ విషయానికి వస్తే.. సినిమాల్లోకి క్యూట్ గా ఎంటర్ అయ్యి హాట్ గా దూసుకుపోతోన్న ఈ భామ ఈ సినిమాతో బాలీవుడ్ లో మంచి పేరు తెచ్చుకుని స్థిరపడాలని చూస్తోంది.
మొదటగా బాలీవుడ్ లో ఫగ్లీ , ఎం.ఎస్ ధోని, మెషిన్ వంటి చిత్రాలు చేసింది. ఆ తరువాత తెలుగులో ఈమెకు ప్రిన్స్ మహేష్ నటించిన భరత్ అనే నేను సినిమాలో అవకాశం లభించింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో రాంచరణ్ సరసన ఓ సినిమాలో నటిస్తోంది. తెలుగు అర్జున్ రెడ్డి సినిమాలో ఉన్నట్టే ఈ హిందీ రీమేక్ లోనూ హాట్ హాట్ సీన్లు ఉండబోతున్నాయట. అయితే ఆ సీన్లలో నటించేందుకు తనకు ఎటువంటి అభ్యంతరం లేదని చెప్పేసింది. ఈ సినిమా తరువాత ఆమె కెరియర్ ఎలా ఉండబోతుందో చూడాలి.