యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ డైరక్షన్ లో వస్తున్న సినిమా సాహో. యువి క్రియేషన్స్ బ్యానర్ లో 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమా నుండి ఈమధ్య వచ్చిన టీజర్ ఆడియెన్స్ ను ఇంప్రెస్ చేసింది. సినిమాలో శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటిస్తుండగా మరో హీరోయిన్ కూడా కనిపించనుందట. అదేంటి సాహోలో శ్రద్ధా కాకుండా మరో హీరోయిన్ ఉందా ఆమె ఎవరు.. ఆమె రోల్ ఏంటని అనుకోవచ్చు.
ఇప్పటికే సాహోపై భారీ అంచనాలు ఉండగా ప్రభాస్ ఫ్యాన్స్ కు, ఆడియెన్స్ కు మరింత కిక్ ఇచ్చేలా ఓ క్రేజీ ఐటం సాంగ్ ప్లాన్ చేస్తున్నారట. ఆ ఐటం సాంగ్ లో ప్రస్తుతం బాలీవుడ్ టాలీవుడ్ అనే తేడా లేకుండా వరుస ఛాన్సులు అందుకుంటున్న కియరా అద్వాని నర్తిస్తుందట. గ్లామర్ షోకి అసలేమాత్రం అడ్డు చెప్పని కియరా ఇటీవలే కబీర్ సింగ్ తో అదిరిపోయే హిట్ కొట్టింది. ఇక ఇప్పుడు సాహోలో స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది.
భరత్ అనే నేనుతో ఎంట్రీ ఇచ్చినా కియరా అద్వాని వినయ విధేయ రామ సినిమాలో రాం చరణ్ సరసన నటించింది. తెలుగులో ప్రస్తుతం ఛాన్సులు లేకున్నా ప్రభాస్ సినిమా అనేసరికి ఐటం సాంగ్ కోసం కూడా రెడీ అన్నది కియరా అద్వాని. మరి ఈ లస్ట్ స్టోరీస్ భామ రెచ్చగొట్టే అందాలతో చేసే సాహో ఐటం బ్లాక్ బ్లాస్టర్ అవుతుందని మాత్రం అవుతుందని చెప్పొచ్చు.