లగ్జరీ కారు కొన్న కియారా అద్వానీ.. ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

Google+ Pinterest LinkedIn Tumblr +

బాలీవుడ్ నటి కియారా అద్వానీ గురించి మనందరికీ తెలిసిందే. కేవలం బాలీవుడ్ లోనే కాకుండా టాలీవుడ్ లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫాలోయింగ్ నీ ఏర్పరుచుకుంది. ఈమె తన అందం అభినయంతో ఎంతోమంది ప్రేక్షకుల మనసులో స్థానం సంపాదించుకుంది. బాలీవుడ్ లో ఎం ఎస్ ధోని, కబీర్ సింగ్, లక్ష్మి, లాంటి సూపర్ హిట్ సినిమాల్లో కలిసి నటించింది. ఇక తెలుగులోభరత్ అనే నేను ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది. ఇకపోతే ప్రస్తుతం శంకర్, దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటించబోతున్న సినిమాలో ఈమె నటిస్తోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

ఒకవేళ ఇదే కనుక నిజమైతే రామ్ చరణ్, కియారా అద్వానీ కాంబోలో వస్తున్న రెండో సినిమా అవుతుంది. కియారా అద్వానీ వ్యక్తిగత జీవితం చాలా రిచ్ గానే ఉంటుంది. ఈమెకు కూడా కార్లు అంటే పిచ్చి. అలా ఈ మీ దగ్గర ఇప్పటికే ఎన్నో విలాసవంతమైన కార్లు ఉన్నాయి. బీఎండబ్ల్యూ ఎక్స్ 5, మెర్సిడెజ్ బెంజ్ ఈ క్లాస్, బీఎండబ్ల్యూ 530 డి ఇలా ఎన్నో రకాల విలాసవంతమైన కార్లు ఆమె దగ్గర ఉన్నప్పటికీ తాజాగా కియారా మరొక కారునీ కొనుగోలు చేసింది.ఆడి ఏ8 ఎల్ కారుని కొనుగోలు చేసింది. ఈ కారు ప్రారంభ ధర దాదాపుగా 1.56 కోట్లు ఉన్నట్లు తెలుస్తోంది.

Share.