సినీ ఇండస్ట్రీలో చాలామంది నటీమణులు నిలదొక్కుకునే ప్రయత్నంలో ఇలాంటి లైంగిక వేధింపులను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే కంటికి రెప్పలా కాపాడాల్సిన తండ్రే లైంగిక వేధింపులకు గురి చేస్తే ఆ బిడ్డ బాధ వర్ణనాతీతం. ఎక్కడో ఒకచోట ఇలాంటి వార్తలు మనం వింటూనే ఉంటాము. అయితే ఇప్పుడు.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఇప్పుడు బుల్లితెర షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్న ఖుష్బూ కూడా తన తండ్రి చేతిలోనే లైంగిక వేధింపులకు గురి అయ్యింది.
తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఖుష్బూ మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపులపై మాట్లాడుతూ.. తాను తన చిన్నతనంలో ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి సంచలన విషయాలు బయటపెట్టడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఖుష్బూ మాట్లాడుతూ.. నేను కూడా లైంగిక వేధింపులకు గురయ్యాను.. నా తండ్రి నుంచి లైంగిక వేధింపులను ఎదుర్కొన్నాను.. అప్పుడు నా వయసు కేవలం ఎనిమిదేళ్లు మాత్రమే.. ఆ సమయంలో ఏదీ నాకు తెలిసేది కాదు.. అయితే నాకు 15 ఏళ్లు వచ్చిన తర్వాత నా తండ్రి చేసే అఘాయిత్యాలను గుర్తించి.. నా తండ్రిని ఎదిరించాను. దాంతో ఆయన ఇంటి నుండి వెళ్లిపోయాడు.. అయితే నా తండ్రి ఇంత దుర్మార్గానికి పాల్పడతాడని అనుకోలేదు అంటూ కన్నీటి పర్యంతమైంది కుష్బూ.
ముంబైలో ముస్లిం కుటుంబంలో జన్మించిన కుష్బూ చిన్ననాటి నుంచి నటనపై ఆసక్తి పెంచుకుంది. వినోద్ ఖన్నా హీరోగా నటించిన ది బర్నింగ్ ట్రైన్ అనే సినిమాతో తొలిసారి కెమెరా ముందుకు వచ్చిన ఈమె.. ఆ తర్వాత తమిళ దర్శకుడు ,నటుడు పి సుందర్ ను ప్రేమ వివాహం చేసుకుంది. ప్రస్తుతం ఈమెకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. వారిని కంటికి రెప్పలా కాపాదుకుంటోంది కుష్బూ.