ప్రస్తుతం తెలుగులో బిగ్ బాస్ ఏడవ సీజన్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే నాలుగు వారాలను దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ఈ షో ఐదవ వారంలోకి అడుగు పెట్టింది. ఇక ఈ వారాంతంతో ఐదు వారాలు కూడా పూర్తి చేసుకోబోతోంది. 14 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ కార్యక్రమం నుంచి ఇప్పటికే నలుగురు ఎలిమినేట్ అవ్వగా పదిమంది కంటెస్టెంట్లు మాత్రమే హౌస్ లో టైటిల్ కోసం పోటీ పడుతున్నారు. అయితే ఇప్పుడు ఊహించిన విధంగా ఏకంగా 6 మందిని వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ప్రవేశపెడుతున్నారు అంటూ వార్తలు వినిపిస్తూ ఉండగా ఈ క్రమంలోనే తాజాగా జబర్దస్త్ కమెడియన్ కార్తీక్ కూడా వైల్డ్ కార్డు ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం.
తాజాగా సీరియల్ నటుడు అంబటి అర్జున్, సీరియల్ నటి పూజా మూర్తి , మ్యూజిక్ డైరెక్టర్ బోలే షామిలి, సీరియల్ నటి అంజలి పవన్, నయని పావని వైల్డ్ కార్డు లిస్టులో ఉండగా వీరి నుండి అంజలి పవన్ చివరి నిమిషంలో తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే స్టార్ కమెడియన్ కార్తీక్ ను లైన్ లోకి తీసుకొచ్చారట బిగ్ బాస్ నిర్వాహకులు. అంతేకాదు కెవ్వు కార్తిక్ బిగ్ బాస్ షో కి వెళ్లడం దాదాపు ఖరారు అయిందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే పలువురు కమెడియన్ లు జబర్దస్త్ బిగ్ బాస్ షోలో పాల్గొని సందడి చేసిన విషయం తెలిసిందే. ముఖ్యంగా చలాకి చంటి, ఫైమా, ముక్కు అవినాష్ వంటి వారు కూడా పాటిస్పెండ్ చేశారు.వీరిలో సీజన్ ఫోర్ లో ముక్కు అవినాష్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మరి ఈసారి వైల్డ్ కార్డు ఎంట్రీ ఇవ్వబోతున్న కెవ్వు కార్తిక్ తన ప్రయాణాన్ని హౌస్ లో ఎలా కొనసాగిస్తారో చూడాలి.