ఈ మధ్యకాలంలో చాలామంది నటీనటులు సైతం ఒకరి తర్వాత ఒకరు ప్రేమించి మరి ఇంట్లో పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుంటున్నారు.. తాజాగా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి మరికొద్ది గంటలలో ఒకటి కాబోతున్నారు. అలాగే నటుడు అర్జున్ కూతురు ఐశ్వర్య కూడా ఒక కోలీవుడ్ కమెడియన్ ని ప్రేమించి మరి వివాహం చేసుకోబోతోంది. అలాగే నటుడు శర్వానంద్ కూడా గత కొద్ది రోజుల క్రితమే వివాహం చేసుకున్నారు. త్వరలోనే తమన్నా కూడా వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పుడు తాజాగా మరొక హీరోయిన్ వివాహానికి సిద్ధమైనట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ఆ హీరోయిన్ ఎవరో కాదు శ్రీదివ్య నటి శ్రీదివ్య మహేష్ బాబు హీరోగా నటించిన యువరాజు సినిమాలో చైల్డ్ యాక్టర్ గా నటించింది. తొలి సినిమాలలో కూడా బాలనటిగా చేసిన తర్వాత బస్ స్టాప్, కేరింత మనసారా తదితర చిత్రాలలో నటించి మంచి విజయాలను అందుకుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ వివాహానికి సిద్ధమయ్యింది అన్నట్లుగా పలు వార్తలు కోలీవుడ్ మీడియాలో వినిపిస్తూ ఉన్నాయి.
అయితే స్వయంగా ఈ విషయాన్ని శ్రీదివ్య ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది. శ్రీదివ్య నటించిన తాజా సినిమా రైడ్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా శ్రీదివ్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఈమెను ఒక రిపోర్టర్ నేరుగా మీరు వివాహం ఎప్పుడు చేసుకుంటారు అని అడగడం జరిగింది.. అందుకు శ్రీదివ్య స్పందిస్తూ నేను త్వరలోనే వివాహం చేసుకోబోతున్నానంటూ తెలిపింది.
కానీ ఈమె వివాహం చేసుకోబోయేది ప్రేమించిన వాడిని లేకపోతే కుటుంబ సభ్యులు చూపించిన వారిని అనే విషయాన్ని తెలియజేయలేదు.. ప్రస్తుతం సోషల్ మీడియాలో శ్రీదివ్య చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి. మరి వచ్చే ఏడాది అయినా ఈ అమ్మడు శుభవార్త తెలియజేస్తుందేమో చూడాలి మరి.