అనిరుధ్ తో కీర్తి సురేష్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన కీర్తి సురేష్ తండ్రి..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలుగు సినీ పరిశ్రమలో అతి తక్కువ కాలంలోనే సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న హీరోయిన్ కీర్తి సురేష్.. సావిత్రి బయోపిక్ మహానటి చిత్రంతో ఎనలేని గుర్తింపును సంపాదించుకుంది. ఆ చిత్రంలో తన నటనకి ఫిదా అయ్యి ఆమెకు అభిమానులుగా చాలామంది మారారు.అంతేకాకుండా ఆ సినిమాకు కీర్తి సురేష్ జాతీయ అవార్డును కూడా అందుకుంది. అయితే ఈ మధ్యకాలంలో సరైన హిట్లు పడటం లేదు కీర్తి సురేష్ కు కానీ కీర్తి పెళ్లిపై మరోసారి రూమర్స్ వినిపిస్తున్నాయి.

Suresh Kumar shuts down Keerthy Suresh's wedding rumours with Anirudh |  Onmanorama

కీర్తి సురేష్ పెళ్లిపై వస్తున్న రూమర్స్ అన్ని అబద్ధమని కూడా తేలింది..ఈసారి ఆమె ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్ ను వివాహం చేసుకోబోతున్నట్లు పుకార్లు వ్యాపించాయి. అయితే ఈ పెళ్లి పుకార్లపై కీర్తి సురేష్ తండ్రి సురేష్ కుమార్ స్పందించారు. కీర్తి, అనిరుద్ పై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు.. ఆ ప్రచారాలన్నీ అబద్ధాలు వాటిలో ఏమాత్రం నిజం లేదు అంటూ చెప్పారు. అయితే కీర్తి సురేష్ పై ఇలాంటి వార్తలు రావడం ఇదేమి మొదటిసారి కాదు..ఇప్పటికే ఇలాంటివి ఎన్నో వచ్చాయి. అయితే ఇలాంటి వార్తలను ఎవరో కావాలని క్రియేట్ చేసి తప్పుగా ప్రచారం చేస్తున్నారు అని ఆయన అన్నారు.

ఇదే సమయంలో కీర్తి సురేష్ కూడా అనిరుద్ తో పెళ్లి పుకార్లను ఖండించింది. టైమ్స్ నౌతో ఆమె మాట్లాడుతూ అది తప్పుడు ప్రచారాలు నాకు అనిరుద్ మంచి స్నేహితుడు మాత్రమే అని తెలిపింది. వీరిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అని కూడా అంటారు. అయితే కొన్ని నెలల క్రితమే దుబాయ్ కి చెందిన ఫర్హాన్ అనే వ్యాపారవేత్తతో కీర్తి సురేష్ సంబంధంలో ఉన్నట్లు పుకార్లు వచ్చాయి కానీ వాటిని కూడా కీర్తి సురేష్ తండ్రి కీర్తి సురేష్ తిప్పి కొట్టడం జరిగింది.

ఇప్పుడు మరొకసారి అనిరుధ్ తో పెళ్లి వార్తలు ఖండించిన కీర్తి సురేష్ తండ్రి అలాంటిది ఏమైనా ఉంటే కచ్చితంగా తన కూతురే తెలియజేస్తుంది అంటు తెలియజేశారు. మరి ఇప్పటికైనా ఈ విషయానికి పుల్ స్టాప్ పడుతుందేమో చూడాలి మరి.

Share.