టాలీవుడ్ ఇండస్ట్రీకి మొట్టమొదటగా నేను శైలజ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. ఈ సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసి ఆ తరువాత పలు చిత్రాలలో నటించింది. ఈ అమ్మడు నటించిన చిత్రం మహానటి.. దీంతో సావిత్రి రేంజ్ లో గుర్తింపు తెచ్చి పెట్టింది. ఈ సినిమాకి గాను బెస్ట్ యాక్టర్ గా కీర్తి సురేష్ ఏకంగా నేషనల్ అవార్డు కూడా అందుకుంది. ఈ నేషనల్ అవార్డును చాలా తక్కువ మంది తారలే అందుకున్నారు.
మహానటి సినిమా తరువాత కీర్తి సురేష్ కెరియర్లో వరుసగా ఫ్లాప్ సినిమాలు పడ్డాయి. ఆమె సోలోగా చేసిన సినిమాలన్నీ డిజార్డర్లను అందుకున్నాయి. ఈమధ్య సర్కారు వారి పాట సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ఆ సినిమాలో కీర్తి సురేష్ కేవలం కమర్షియల్ హీరోయిన్ గానే కనిపించింది. ఆమె పాత్రకి ఆశించిన స్థాయిలో ప్రాధాన్యత లేదని చెప్పాలి.
ఇక ఇప్పుడు కీర్తి సురేష్ కి స్టార్ హీరోయిన్ అనే బ్రాండ్ తెచ్చుకోవాలంటే కమర్షియల్ సినిమాలే చేయాలని ఆమె ఫ్యాన్స్ అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే వర్కౌట్స్ చేసి బొద్దుగా ఉండే కీర్తి సురేష్ ఈమధ్య బక్కగా ముద్దుగా మారిపోయింది. అదే సమయంలో గ్లామర్ షో కి తెరతీసింది. రెగ్యులర్గా ఆమె ఇంస్టాగ్రామ్ లో హాట్ ఫోటోలను షేర్ చేస్తూ గ్లామర్ షో కి కూడా తాను రెడీ అని దర్శకులకు అందిస్తోంది.
ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి అందులో భోళా శంకర్ సినిమాలో చిరంజీవికి చెల్లి పాత్ర ఒక్కటైతే.. మిగిలినవన్నీ హీరోయిన్ పాత్రలే.. ఈమె ఫుల్ గ్లామర్ రోల్స్ లో ఆల్ట్రా మోడ రన్ గర్ల్ గా కీర్తి సురేష్ కనిపిస్తోందని తెలుస్తోంది.