టాలీవుడ్ ఇండస్ట్రీలో మహానటిగా పేరు సంపాదించుకున్న హీరోయిన్ కీర్తి సురేష్ ఆ తర్వాత పలు సినిమాలలో నటించి మంచి ఇమేజ్ను దక్కించుకుంది. ఈ అమ్మడు ఈ మధ్యనే భోళా శంకర్ చిత్రంతో కాస్త నిరాశను మిగులుచుకుంది. అందుకేనేమో తమిళ్ సినిమాలపై ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఒక వైపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ మరో వైపు హాట్ లేడీగా స్టార్ హీరోల కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ గా కనిపిస్తోంది. హీరోయిన్ గా ఎంత బిజీగా ఉన్నా ఇలాంటి చిల్ మూమెంట్స్ ను సోషల్ మీడియాలో కీర్తి రెగ్యులర్ గా షేర్ చేస్తూ ఉంటుంది.
ఇంతకు ఆమె పెట్టిన చిల్ మూమెంట్ ఏంటంటే కమర్షియల్ సినిమాల్లో హీరోలు కార్లు జీప్ లను నడుపుతున్న సమయంలో దుమ్ము లేవడం, సడెన్ బ్రేక్ వేసిన సమయంలోటైర్లు సర్రున జారడం వంటివి మనం చూస్తూ ఉంటాం.అయితే హీరోలు చేసిన సమయంలో కార్లు రోప్స్ తో కట్టి ఉంచడం చేస్తారు.. లేదంటే డూప్ లతో అలాంటి సన్నివేశాలను ఎక్కువగా చిత్రీకరిస్తారు అనే విషయం తెల్సిందే.
హీరోలే కొంతమంది అలా డూపును పెట్టి మెయింటైన్ చేస్తుంటే మన అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ మాత్రం
జీప్ ను బీచ్ లో దుమ్ము రేపుతూ ఆమె చేసిన యాక్షన్ స్టంట్ కి అంతా కూడా ఆశ్చర్యపోయి మరీ చూస్తున్నారు. నేటిజన్స్ ఆ సీను మరీ మరీ చూస్తున్నారు. కీర్తి సురేష్ లో అందాన్ని చూసాం ఈ టాలెంట్ కూడా తనకు ఉందని ఆశ్చర్యపోతున్నారు ఆమె అభిమానులు. మొత్తానికి కీర్తి సురేష్ మళ్లీ ఈ టాలెంట్ తో వార్తల్లో నిలిచింది.రేంజ్ లో యాక్షన్ స్టంట్స్ చూపిస్తే ముందు ముందు ఈమె కోసం దర్శకులు యాక్షన్ సినిమాల స్క్రిప్ట్ లు రెడీ చేస్తారేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం అందుకు సంబంధించిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఏది ఏమైనా కీర్తి సురేష్ షేర్ చేసిన వీడియో క్షణాల్లో వైరల్ గా మారుతున్నది.
View this post on Instagram