Keerthi Suresh:కీర్తి సురేష్ ఆస్తులు చూస్తే షాక్ అవ్వాల్సిందే..?

Google+ Pinterest LinkedIn Tumblr +

Keerthi Suresh.. తెలుగు సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్గా పేర్కొంది హీరోయిన్ కీర్తి సురేష్..(Keerthi Suresh) సినీ ఇండస్ట్రీ ఉన్న నేపథ్యం కారణంతో ఈమె ఇండస్ట్రీలోకి అవలీలగా ఎంట్రీ ఇచ్చింది. ఈమె తల్లి మేనక కూడా ఒక హీరోయిన్ ముఖ్యంగా చిరంజీవితో పునాదిరాళ్లు వంటి సినిమాలు నటించింది. నేను శైలజ సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్.ఆ తర్వాత మహానటి సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకుంది.

Keerthy Suresh Height, Weight, Age, Husband, Family, Biography & More »  StarsUnfolded

మహేష్ కి జోడిగా సర్కారు వారి పాట సినిమాలో నటించి అదరగొట్టేసింది ప్రస్తుతం నాని సరసన దసరా చిత్రంలో నటిస్తున్నది. గత కొంతకాలంగా వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమాలోని మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత కీర్తి సురేష్ ఆస్తులను బాగానే సంపాదించిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు కీర్తి సురేష్ ఆస్తి విలువ రూ.40 నుంచీ రూ.50 కోట్ల మధ్యలో ఉన్నట్లు తెలుస్తోంది.

కీర్తి సురేష్ ఒక్కో సినిమాకి కెరియర్ ప్రారంభంలో రూ .70 లక్షల రూపాయల వరకు అందుకునేది. ఒకసారి స్టార్ హీరోయిన్ మారిపోయాక రూ .2 కోట్ల రూపాయలకు పైగా రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు సమాచారం. అలాగే కొన్ని ప్రముఖ బ్రాండ్లకు కూడా అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది ఇంటర్నేషనల్ జోయాలుకాస్ తదితర బ్రాండ్లకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తోంది కీర్తి సురేష్. గ్లామర్ పాత్రలకు కూడా కాస్త దూరంగా ఉంటూ ఉండేది ఈ ముద్దుగుమ్మ.

హైదరాబాదులో జూబ్లీహిల్స్ లో ఒక కాస్ట్లీ ఇల్లు ఉంది అలాగే లగ్జరీ కార్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే పొలాలు స్థలాలు అన్ని కలుపుకొని కీర్తి సురేష్ ఆశీర్వ దాదాపుగా రూ.70 కోట్ల వరకు ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మార్చి 30వ తేదీన దసరా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది కీర్తి సురేష్ మరి ఏ మేరకు ఆకట్టుకుంటుందో చూడాలి మరి.

Share.