Keerthi Suresh.. మహానటి సినిమాతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న కీర్తి సురేష్(Keerthi Suresh) ప్రతి ఒక్కరికి సుపరిచితమే.ఈమె మళయాలం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైనప్పటికీ తెలుగులో మాత్రం నేను శైలజ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. కానీ కీర్తి సురేష్ కి పేరు తెచ్చి పెట్టిన సినిమా మాత్రం మహానటి సినిమా నే అని చెప్పవచ్చు. ఈ సినిమా సావిత్రి బయోపిక్ ఆధారంగా తెరకెక్కించడం జరిగింది. అచ్చం సావిత్రి లాగానే నటించి అందరితో ప్రశంసలు అందుకుంది కీర్తి సురేష్.
మహానటి సినిమా లో తన నటనకు గాను నేషనల్ అవార్డును కూడా అందుకోవడం జరిగింది. ఈ సినిమా తర్వాత కొన్ని చెప్పుకోదగ్గ సినిమాలలో నటించినప్పటికీ అంతగా సక్సెస్ కాలేక పోయింది. ఇక గత ఏడాది మహేష్ బాబుతో కలిసి సర్కారు వారి పాట సినిమాలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకుంది. ఇప్పుడు నటుడు నానితో కలిసి దసరా అనే సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా విడుదల అవుతూ ఉండడంతో ఈమెకు కూడా మంచి పాపులారిటీ లభిస్తోంది.
దసరా సినిమా ఈనెల 30వ తేదీన విడుదల కాబోతోంది. తాజాగా దసరా సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్న కీర్తి సురేష్ ముంబైకి వెళ్లి అక్కడ కూడా ప్రమోషన్స్లో పాల్గొనడం జరిగింది.. తాజాగా ఒక మీడియా ఛానళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చిన కీర్తి సురేష్ యాంకర్ అడిగిన ప్రశ్నలకు దీటుగా సమాధానాలు తెలియజేసింది..మీరు బాలీవుడ్ లో నటిస్తారా అని అడిగితే నాకు నటించాలని ఉంది అంటూ తెలియజేసింది.
ఇక బాలీవుడ్ హీరోలలో తనకు షారుఖ్ఖాన్ అంటే చాలా ఇష్టమని ఆయనతో నటించే అవకాశం వస్తే మాత్రం అసలు వదులుకోనని ఒక్కసారైనా ఆయనతో నటించాలని భావిస్తున్నాను అంటూ కీర్తి సురేష్ తెలియజేయడం జరిగింది. తన మనసులో ఉన్న మాటని బయట పెట్టడం జరిగింది. ప్రస్తుతం కీర్తి సురేష్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.