టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు ఎం ఎం కీరవాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఆర్ ఆర్ ఆర్ సినిమాతో పాపులారిటీ అందుకున్న ఈయన గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకోవడంతో ఇప్పుడు ఎక్కడ చూసినా ఈయన పేరే మారుమ్రోగుతోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈయన తండ్రికి సంబంధించిన కొన్ని విషయాలు మరింత వైరల్ గా మారుతున్నాయి. కీరవాణి తండ్రి శివశక్తి దత్త గురించి ఈ తరం ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోయినా.. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ నాటి కాలం ప్రేక్షకులకు పరిచయం అవసరం లేదు.
లిరిసిస్టు, స్క్రీన్ రైటర్, పెయింటర్ గా తనకంటూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్నారు. ఎంతో టాలెంట్ ఉన్న శివశక్తి దత్త ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వందల ఎకరాలను పోగొట్టుకోవడానికి తనకున్న పిచ్చి అలవాటే కారణమని అందరికీ షాక్ ఇచ్చేలా కామెంట్లు చేశారు. ఆయన మాట్లాడుతూ .. నేను బాధపడ్డ సందర్భాలు ఏవి లేవు.. రాజమౌళి, కీరవాణి సినిమాలలో బాహుబలి సినిమా అంటే చాలా ఇష్టం తెలిపారు.
రాజమౌళి టేస్ట్ ఎలా ఉంటే అలా సినిమాలు చేస్తాడని ఆయన తెలిపారు.. ఆ తర్వాత మాట్లాడుతూ.. నాకు సినిమా ఫ్యాషన్ ఎక్కువ.. తుంగభద్రా సైడు మేము వలస వెళ్ళాము.. అక్కడ 300 ఎకరాలు కొన్నాను.. ఆ ఏరియా అంతట నాకు పెద్ద పేరు ఉంది. 50 మైళ్ళ దూరంలో అందరికీ నా పేరు తెలుసు. నేను అంత పాపులర్ అని చెప్పుకొచ్చారు శివశక్తి దత్త. సినిమాల మీద మోజుతో కొంతకాలంలో మద్రాస్ లో సెటిల్ కావడానికి సినిమాలు తీయడానికి ఆ 300 ఎకరాలు అమ్మేశాను అంటూ ఆయన కామెంట్లు చేశారు.ఈరోజు ఎలా రేపు ఎలా అని పరిస్థితికి చివరికి చేరుకున్నాము అని ఆయన తెలిపారు . ఆ తర్వాత జానకి రాముడు, కొదమ సింహం సినిమాల ద్వారా మళ్ళీ నిలబడ్డామని శివశక్తి దత్త తెలిపారు. అయితే ఆ సమయంలో రాజమౌళి చాలా చిన్న పిల్లవాడని , మేము ఆరుగురు అన్నదమ్ములమని ఆయన వెల్లడించారు.