ప్రస్తుతం టాలీవుడ్ లో బడా హీరోలలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. ప్రస్తుతం ఆచార్య అనే సినిమాలో నటిస్తున్నారు. అలాగే మరికొన్ని సినిమాలలో నటించేందుకు సిద్ధం అయ్యారు మెగాస్టార్. ఇదిలా ఉంటే మరొక పక్క సినీ పరిశ్రమలో అనేక ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లోని టిక్కెట్ల ధరల విషయంలో పెద్ద రచ్చే నడుస్తోంది.
తెలుగు చిత్ర పరిశ్రమకు మాత్రం.. తెలంగాణ ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్లు ప్రకటించింది. తాజాగా తీసుకున్న నిర్ణయం పట్ల.. టాలీవుడ్ వారు హర్షం వ్యక్తం చేస్తుండగా మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధర విషయంలో తీసుకున్న నిర్ణయానికి చిరంజీవి తన తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.
తెలుగు సినిమా పరిశ్రమ కోరుకుని మన్నించి, నిర్మాతలకు, పంపిణీ దారులకు, థియేటర్ యజమానికి అన్ని వర్గాల వారికి మేలు కలిగేలా చేశారని తెలియజేశారు. సినిమా థియేటర్ పై ఆధారపడిన వేలాది మంది కార్మికులకు ఎంతో మేలు కలిగేలా నిర్ణయం తీసుకున్నారని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు చిరంజీవి.
తెలుగు సినిమా పరిశ్రమ కోరికని మన్నించి, నిర్మాతలకు, పంపిణీదారులకు,థియేటర్ యాజమాన్యానికి అన్ని వర్గాల వారికీ న్యాయం కలిగేలా సినిమా టికెట్ రేట్స్ సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ KCR గారికి కృతఙ్ఞతలు.🙏🏻🙏🏻 సినిమా థియేటర్ల మనుగడకు,వేలాదిమంది కార్మికులకు ఎంతో మేలు కలిగే నిర్ణయం ఇది. pic.twitter.com/w6VbRMtrG5
— Chiranjeevi Konidela (@KChiruTweets) December 25, 2021