తాజాగా కత్రినా కైఫ్ , విక్కీ కౌశల్ డిసెంబర్ 9వ తేదీన ఏడు అడుగులు వేసి జంట గా మారారు. ఇకపోతే వీరి పెళ్లికి తక్కువ సంఖ్యలో సెలబ్రిటీలు హాజరయ్యారు. ఇక పెళ్లి సందర్భంగా ఆమె నిశ్చితార్థపు ఉంగరం కి సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆమె చేతికి తొడుక్కున్న ఎంగేజ్మెంట్ రింగ్ విలువ అక్షరాల ఏడున్నర లక్షల రూపాయలట. అప్పట్లో బ్రిటన్ యువరాణి ప్రిన్సెస్ డయానా నిశ్చితార్థం సమయంలో తన నిశ్చితార్థానికి పెట్టుకున్న ఉంగరం లాంటిది. కత్రినా కైఫ్ కూడా అలాంటి ఉంగరాన్ని సొంతం చేసుకున్నారని బాలీవుడ్ మీడియా వర్గాల సమాచారం.
కత్రినా తన పెళ్లికి ధరించిన చీర విలువ 56 వేల రూపాయలు. ఇక మెడలో ఉన్న మంగళసూత్రం విలువ సుమారుగా లక్షల్లోనే ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇకపోతే మరోవైపు అమెజాన్ ప్రైమ్.. కత్రినా విక్కీ కౌశల్ వెడ్డింగ్ ఫోటోల హక్కులను 80 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసినట్లు సమాచారం.