పెళ్లి తరువాత టైగర్ 3 సినిమా కోసం ఢిల్లీకి పయనం అయిన కత్రీనా..?

Google+ Pinterest LinkedIn Tumblr +

బాలీవుడ్ జంట విక్కీ కౌశల్, కత్రినాకైఫ్ ఇటీవలే మూడుముళ్ల బంధంతో ఒక్కటైన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత ఈ జంట యధావిధిగా సినిమా షూటింగ్ లో బిజీ బిజీగా గడుపనున్నారు. పెళ్లికి సంబంధించిన పనులన్నీ పూర్తి చేసుకుని సినిమా షూటింగ్ షెడ్యూల్ ని ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పటికే విక్కీ కౌశల్ తన సినిమా షెడ్యూల్ ని ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా కత్రినా కైఫ్ కూడా మూవీ షూటింగ్ లో పాల్గొననుంది. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న టైగర్ 3 సినిమా చివరి షెడ్యూల్లో పూర్తి చేసేందుకు కత్రినా కైఫ్ త్వరలోనే ఢిల్లీకి పయనం కానుంది.

కత్రినాకైఫ్ షెడ్యూల్ సుమారుగా పదిహేను రోజులుగా ఉంటుందట అని సమాచారం. అనుకున్నది అనుకున్న విధంగా జరిగేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తుందట..ఒకవేళ అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే దేశ రాజధాని లొ సల్మాన్ ఖాన్, కత్రినా కైఫ్ ఇద్దరితో షూటింగ్ నిర్వహించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.అలాగే సల్మాన్ ఖాన్,కత్రినా కైఫ్ ఇద్దరూ స్టార్లు కావడంతో షూటింగ్ కు సంబంధించిన ఫోటోలను బయటకు లీక్ కాకుండా జాగ్రత్త పడుతున్నారు.

సల్మాన్ ఖాన్ కత్రినా కు బెస్ట్ ఆఫ్ స్క్రీన్ బెస్ట్ జోడి అని పేరున్న విషయం అందరికీ తెలిసిందే.వీరి షూటింగ్ కి సంబంధించి ఎక్కువ భాగం ఢిల్లీలో చిత్రీకరించనున్నారట. ఈ సినిమా షూటింగ్ కు సల్మాన్ ఖాన్ కత్రినా కైఫ్ సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఈ షెడ్యూల్ తో టైగర్ 3 సినిమా ముగింపు దశకు చేరుకోనుంది. ఈ సినిమా స్పై థ్రిల్లర్ గా రాబోతుంది.ఈ సినిమాకు సంబంధించి ఢిల్లీలో చిత్రీకరించే పలు సన్నివేశాలు అత్యంత ఘోరమైన మిషన్ కు సంబంధించిన విషయాలు అని సమాచారం. టైగర్ ఫ్రాంచైజీ నుంచి వస్తున్న మూడో సినిమా ఇది. ఈ ఫ్రాంచైజీ లో మొదటి భాగం 2012లో వచ్చిన ఏక్ థా టైగర్ ను కబీర్ ఖాన్ డైరెక్ట్ చేశారు. రెండవ భాగం 2017 లో టైగర్ జిందా హై ను అలీ అబ్బాస్ జాఫర్ దర్శకత్వం వహించారు. ఇక మూడవ భాగాన్ని టైగర్ 3 ను మణి శర్మ తెరకెక్కిస్తున్నారు ఈ సినిమాలో ఇమ్రాన్ హాష్మీ కీలక పాత్ర చేయనున్నాడు.

Share.