బాలీవుడ్ జంట కత్రినాకైఫ్, విక్కీ కౌశల్ ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్న ఈ జంట ఇటీవలే డిసెంబర్ 9న మూడు ముళ్ళ బంధంతో ఒక్కటయ్యారు.వీరి పెళ్లి రాజస్థాన్ లోని ఒక హోటల్ లో అతిథులు,ఇరువురి కుటుంబ సభ్యులు, బాలీవుడ్ లోని పలువురు ప్రముఖులు సమక్షంలో జరిగింది. ఈ జంట పెళ్లి లో కత్రినాకైఫ్ ధరించిన లెహంగాతో,పాటుగా ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అంతేకాకుండా కత్రినా కైఫ్ వేలుకు తొడిగిన ఉంగరం ప్రత్యేకంగా మెరుగవడంతో పాటు, అందరి దృష్టిని ఆకర్షించింది.
పెళ్లికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కత్రినా ధరించిన ఆ ఉంగరం గురించే మాట్లాడుకున్నారు. ఆ నిశ్చితార్థపు ఉంగరంలో నీలమణితో చేసిన డైమండ్ అమర్చబడి ఉంది.ఆ ఉంగరం చూడడానికి అందంగా, కాస్ట్లీ గా ఉండడంతోపాటు అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఆ ఉంగరం ఖరీదు విషయానికి వస్తే దాని ధర అక్షరాల ఏడు లక్షల నలభై వేల రూపాయలు.ఈ ఉంగరం తో పాటుగా కత్రినా ధరించిన ఆభరణాలు, కాస్ట్యూమ్స్ కూడా హైలెట్ గా నిలిచాయి.ఈ పెళ్లి లో ఆమె కత్రినా సభ్యసాచి అనే ఒక డిజైనర్ డిజైన్ చేసిన లెహంగా ను ధరించింది.