బాలీవుడ్ ప్రేమ జంట విక్కీ కౌషల్-కత్రినా కైఫ్ పెళ్లికి సిద్ధమవుతున్నారు.వీరు గత గత కొద్ది రోజులుగా ప్రేమలో మునిగి తేలుతున్న విషయం తెలిసిందే.వీరి వివాహం డిసెంబర్ లో 3 రోజుల పాటు గ్రాండ్ గా జరగనుంది.ఈ పెళ్లికి ఓ రేంజ్ లో అరేంజ్ మెంట్స్ జరుగుతున్నాయి.అయితే హీరోయిన్ల పెళ్లి అంటే ఏ రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కానీ వీరి వివాహం మాత్రం మీడియాకు దూరంగా ఎంతో రహస్యంగా జరుపుకోనున్నారట. ఈ వివాహానికి కుటుంబ సభ్యులు బంధువులు మిత్రులు అతిరథమహారధులు హాజరు కానుండగా ఈ వివాహానికి హాజరయ్యే అతిథులకు ఈ జంట బోలెడన్ని కండిషన్ లు పెట్టారట.
అయితే ఈ జంట 14వ శతాబ్దపు కోటలో సాంప్రదాయ పంజాబీ వివాహంతో ఒక్కటికానున్నారు.ఈ రోజో రేపో రిజిస్టర్డ్ మ్యారేజీ చేసుకోబోతున్నారట. ప్రత్యేక వివాహ చట్టం కింద తమ పెళ్లిని నమోదు చేసుకోనున్నారు. ఈ వేడుక ముగిసిన అనతరం గ్రాండ్ వెడ్డింగ్ కోసం రాజస్థాన్ వెళ్లానున్నారు. ప్రస్తుతం ఈ జంట పెళ్లికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.