యంగ్ హీరో కార్తీకేయ వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ఆర్ఎక్స్ 100 సినిమా టైటిల్‌కి తగ్గట్టుగానే బాక్సాఫీస్ దగ్గర ఝుమ్… ఝుమ్మంటూ సందడి చేసింది. న్యూవేవ్ సినిమాగా, కల్ట్ మూవీగా భారీ విజయాన్నిసొంతం చేసుకుని సినీ అభిమానుల గుండెల్లో పదిలంగా చోటుచేసుకుంది. కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ ఈ సినిమాను తెరకెక్కించింది.
ఈ సినిమాతో కార్తీకేయ హీరోగా గుర్తింపు పొందాడు. ఇప్పుడు మళ్లీ వీరి కాంబినేషన్లో సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో కార్తికేయ సరసన నేహా సోలంకి నాయికగా నటిస్తున్నారు. శేఖర్ రెడ్డి ఎర్ర దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. నిమిషం పాటు ఉన్న టీజర్ చూస్తే రొటీన్‌గానే ఉంది.
అయితే హీరోకు ఉన్న మద్యం కాన్సెఫ్ట్‌తో సినిమా నడుస్తుందని తెలుస్తోంది. ఇదే కాస్త కొత్త కాన్సెఫ్ట్గా ఉంటుంది.ఇక టీజర్లో డైలాగులు కూడా హీరో క్యారెక్టర్‌ను చెప్పకనే చెప్పేశాయి. నా కడుపున దేవదాస్ లాంటి కొడుకే పుట్టాలి.. కాళీదాస్ లాంటి ఒక రైటర్ పుట్టాలని కోరుకో.. జేసుదాస్ లాంటి ఒక సింగర్ పుట్టాలని కోరుకో… కానీ దేవదాస్ లాంటి ఒక డ్రింకరు..
ఆరే డీజల్‌తో నడిచే బండ్లను చూసుంటావ్.. పెట్రోల్‌తో నడిచే బండ్లను చూసుంటావ్… ఇది లిక్కర్‌తో నడిచే బండి…ఎంత ఏస్తావ్… రోజుకో 90 ఎంఎల్ సార్… ఏ క్వార్టర్ ఇస్తే ఏయవా… డాక్టర్ 90ఎంల్ తాగమన్నాడు సార్ అన్న డైలాగులు బాగున్నాయి. కథ రొటీన్‌గానే కనపడుతున్నా… ట్రీట్మెంట్ ఎలా ? ఉంటుందో ? చూడాలి.