ఆ బాలీవుడ్ హీరోకి రెండుసార్లు విషెస్ చెప్పాలట?

Google+ Pinterest LinkedIn Tumblr +

నేడు అనగా నవంబర్ 22 బాలీవుడ్ హీరో కార్తీక్ ఆర్యన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా అతడికి డబుల్ సెలబ్రేషన్స్ దక్కాయి. కార్తీక్ ఆర్యన్ తాజాగా నటించిన చిత్రం ధమాకా. ఈ సినిమా నవంబర్ 19న నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయ్యింది. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. దీనితో అతని బర్త్ డే కేక్ పై ధమాకా బాయ్ అని రాసి సెలబ్రేట్ చేశారు. కార్తీక్ తన బర్తడే కేక్ ను పోస్ట్ చేస్తూ మళ్లీ పుట్టిన రోజు వచ్చింది అందుకు చాలా సంతోషంగా ఉంది, నాకు రెండు సార్లు శుభాకాంక్షలు చెప్పండి అంటూ నవ్వుతూ క్యాప్షన్ ఇచ్చాడు.

 

కార్తీక్ ఆర్యన్ పుట్టినరోజు సందర్భంగా పలువురు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే మీరు ప్రేమ, సుఖశాంతులు కలగాలని కోరుకుంటున్నా అంటూ అనుష్కశర్మ విష్ చేసారు. అలాగే జాక్వలిన్ ఫెర్నాండేజ్ కూడా కార్తిక్ ఆర్యన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. సోషల్ మీడియా వేదికగా అతని అభిమానులు పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. శిల్పాశెట్టి కార్తీక్ ను ధమాకా అని పిలుస్తూ నీలో ధమాకా వంటి ప్రతిభ ఉంది అంటూ బర్త్డే విషెస్ చేసింది.

Share.