కార్తీ ‘ ఖైదీ ‘ 3 డేస్ క‌లెక్ష‌న్స్‌.. దుమ్ముదులిపేస్తున్న కార్తీ..

Google+ Pinterest LinkedIn Tumblr +

కోలీవుడ్ హీరో కార్తీ ఎట్ట‌కేల‌కు చాలా లాంగ్ గ్యాప్ త‌ర్వాత ఖైదీ సినిమాతో హిట్ కొట్టాడు. ఈ దీపావ‌ళికి మ‌రో క్రేజీ హీరో విజ‌య్ బిగిల్ (తెలుగులో విజిల్‌) సినిమాకు పోటీగా వ‌చ్చిన ఖైదీ మంచి టాక్ సొంతం చేసుకుంది. ప్ర‌యోగాత్మ‌క చిత్రంగా వ‌చ్చినా కూడా క‌మ‌ర్షియ‌ల్‌గా మంచి వ‌సూళ్లు సాధిస్తోంది. విజిల్‌తో గ‌ట్టి పోటీ ఉన్నా కూడా రెండో రోజు నుంచి బాగా పుంజుకుంది.

సందీప్ కిష‌న్ హీరోగా న‌గ‌రం లాంటి వైవిధ్య‌మైన సినిమా తీసిన ఈ సినిమా క‌థ‌, క‌థ‌నాలు ప్రేక్ష‌కుల‌ను క‌ట్టి ప‌డేశాయి. ఏపీ, తెలంగాణ‌లో తొలి మూడు రోజుల్లో ఖైదీ రూ .1.81 కోట్ల థియేట్రికల్ షేర్ రాబ‌ట్టింది. ఈ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కులు రూ .3.5 కోట్లకు అమ్ముడవుతున్నాయి. మొత్తానికి చాలా రోజుల త‌ర్వాత ఖైదీకి తెలుగులో మంచి హిట్ ద‌క్కింది. ఖైదీ యొక్క మూడు రోజుల తెలుగు వ‌సూళ్లు ఇలా ఉన్నాయి.

ఖైదీ ఏపీ – తెలంగాణ 3 డేస్ క‌లెక్ష‌న్స్ :

నైజాం – 0.65

సీడెడ్ – 0.26

వైజాగ్ – 0.24

గుంటూరు – 0.14

ఈస్ట్ – 0.12

వెస్ట్ -0.10

కృష్ణ – 0.22

నెల్లూరు – 0.08
————————————
ఏపీ + తెలంగాణ = 1.81 కోట్లు
————————————-

Share.