తెలుగు బుల్లితెర సీరియల్స్ లో రారాజుగా ఒక వెలుగు వెలిగిన సీరియల్స్ లో కార్తీకదీపం మొదటి స్థానంలో ఉంటుంది.. ఒకప్పుడు ఈ సీరియల్ టిఆర్పి రేటింగ్ ఇండియన్ రికార్డ్స్ ను కూడా బ్రేక్ చేసింది. అయితే ఈ మధ్యకాలంలో సీరియల్ టి ఆర్ పి రేటింగ్ కాస్త తగ్గింది. కానీ ఏ సీరియల్ కి రానంతగా కార్తీకదీపం సీరియల్ వ్యూయర్ షిప్ రాబట్టుకుంది. సోషల్ మీడియాలోనే కాదు ఎక్కడ చూసినా సరే డాక్టర్ బాబు వంటలక్క అంటూ మూత మోగేది.. 2017లో మొదలైన ఈ సీరియల్ ను అప్పట్లో పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఆ తర్వాత మాత్రం డాక్టర్ బాబు, వంటలక్క అంటూ ఏకంగా ఈ క్యారెక్టర్ లను సినిమాలలో కూడా పెట్టి చూపిస్తున్నారు అంటే ఏ రేంజ్ లో పాపులారిటీ దక్కించుకుందో అర్థం చేసుకోవచ్చు.
ముఖ్యంగా వంటలక్క గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఈమె అసలు పేరు ప్రేమీ విశ్వనాథ్ కేరళకు చెందిన ఈమె.. తెలుగింటి ఆడపడుచులా చక్కగా తెలుగు ప్రేక్షకుల మదిలో నిలిచిపోయింది. యావత్తు రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి గుర్తింపు తెచ్చుకున్న ప్రేమీ విశ్వనాథ్ కి సంబంధించిన ఏ విషయమైనా సరే ఇట్టే వైరల్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ప్రేమీ విశ్వనాథ్ కు ఒక అరుదైన వ్యాధి వచ్చిందని సమాచారం. ఇప్పటికే రేణు దేశాయ్, సమంతా, గౌతమీ, సోనాలి బింద్రే, హంస నందిని ఇలా చాలామంది ఇలాంటి అరుదైన వ్యాధి బారినపడి చికిత్స పొందుతున్న వారే.. నిజానికి పాత్రల కోసం వీరు వేసుకునే మేకప్ వారిపై పడే ఖరీదైన లైట్లు వెలుతురు వల్ల వారు ఇలా చర్మవ్యాధుల బారిన పడుతుంటారు కానీ కెమెరా ముందు మాత్రం తమకు ఏమీ కానట్లుగానే నటనతో జీవిస్తూ ఉంటారు.
ఇకపోతే వంటలక్క అలియాస్ ప్రేమీ విశ్వనాథ్ కూడా ఈ లిస్ట్ లోకి చేరిపోయింది. ముఖంపై మచ్చలు ఏర్పడ్డాయట.. ఈ వ్యాధికి ఆమె చికిత్స తీసుకుంటుందట. కార్తీకదీపం సీరియల్ కోసం ఆమె నల్లటి మేకప్ ను ఎక్కువ డోస్ లో తీసుకోవడం కారణంగా ఆమె స్కిన్ సమస్యకు గురైందని అంటున్నారు. గతంలో కూడా ఆమె ఇటువంటి సమస్యతో బాధపడడంతో కొన్ని ఎపిసోడ్స్ పాటు ఆమెను దూరం పెట్టారు. ప్రస్తుతం ఆమె స్కిన్ సమస్య నుంచి బయటపడే ప్రయత్నాల్లో ఉందని వార్తలు వినిపిస్తున్నాయి .ఈ విషయం తెలిసి ప్రేమీ విశ్వనాథకు త్వరగా నయం కావాలని కోరుకుంటున్నారు ఫ్యాన్స్.