భారీ డిజాస్ట‌ర్ దిశ‌గా కార్తీ `దొంగ‌`.. మూడు రోజుల క‌లెక్ష‌న్స్‌..

Google+ Pinterest LinkedIn Tumblr +

తమిళ హీరో కార్తీ ఖైదీ చిత్రం ఇచ్చిన విజయంతో మరోసారి తెలుగులో దొంగ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కార్తీ తమిళంతో పాటుగా తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది. విధ్యమైన సినిమాలతో తెలుగు సినీ ప్రేక్షకు మనసు గెలుచుకున్నారు.ఆయన నటించిన చిత్రాలన్ని తెలుగులోనూ అనువాదమవుతున్నాయి. మొదటి చిత్రం నుంచే విలక్షణ నటుడిగా నిరూపించుకున్న కార్తీ ఆవారా, నా పేరు శివ, ఊపిరి లాంటి చిత్రాలతో టాలీవుడ్‌కు మరింత దగ్గరయ్యాడు. ఇక ప్ర‌స్తుతం తమిళంలో తంబి చిత్రం తెలుగు అనువాదమే దొంగ‎ చిత్రం.

ఈ చిత్రానికి దృశ్యం ఫేమ్ జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో కార్తీ వదిన నటుడు సూర్య సతీమణి జ్యోతిక కీలక పాత్రలో నటించారు. సత్యరాజ్, నిఖిల, షావుకారు జానకి పలువురు ముఖ్య పాత్రల్లో కనిపించారు. ఈ చిత్రాన్ని వయాకామ్‌ 18 స్టూడియోస్‌, ప్యారలల్‌ మైండ్స్‌ సంయుక్తంగా నిర్మించాయి. ఈ చిత్రం డిసెంబ‌ర్ 20న విడుద‌ల అయింది. అయితే సరైన ఓపినింగ్స్ కూడా తెచ్చుకోలక చతికిలబడ్డ ఈ చిత్రం తమిళంలో యావరేజ్ అనిపించుకుంది. తెలుగులో ఆ టాక్ కూడా రాలేద‌ని చెప్పాలి.

ఖైదీ సినిమా క్రేజ్ వలన మొదటి రోజు ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి కానీ ఆ తర్వాత డల్ అయ్యాయి. ఓవరాల్ గా మొదటి వీకెండ్ ఈ సినిమా 69 లక్షల షేర్ ని సాధించింది. ‘దొంగ’ సినిమాని సుమారు 3.7 కోట్లకి కొనుగోలు చేశారు. కానీ ఈ సినిమా మొదటి వీకెండ్ అందులో 22% మాత్రమే కలెక్ట్ చేయడంతో డిస్ట్రిబ్యూటర్స్ కి భారీగా న‌ష్టం వ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా క‌నిపిస్తోంది.

కార్తీ ‘దొంగ’ ఫస్ట్ వీకెండ్ ఆంధ్ర – తెలంగాణ కలెక్షన్స్:

మొదటి రోజు- 23.5 లక్షలు

రెండవ రోజు- 20 లక్షలు

మూడవ రోజు- 25 లక్షలు
———————————————————-
ఫస్ట్ వీకెండ్ మొత్తం కలెక్షన్స్ – 68.5 లక్షలు
———————————————————–

Share.