కరోనా మహమ్మారి కాస్త తగ్గింది అనుకునే లోపు తన రూపాన్ని మార్చుకొని మరొక రూపంలో ఓమిక్రాన్.. గా మరి తన ఉగ్రరూపాన్ని చూపిస్తోంది. గత రెండు సంవత్సరాల నుంచి కరోనా కష్టాలు తెచ్చిపెడుతోంది. సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటీస్ వరకు ఎవరిని కూడా వదలడం లేదు ఈ కరోనా. ఇప్పటికే కమలహాసన్ ఫారిన్ ట్రిప్ తర్వాత కరోనా బారిన పడి, తిరిగి కోలుకున్నారు. ఇక ఇవాళ టాలీవుడ్ అగ్ర హీరోయిన్ సమంత సైతం నిన్న కడపకు వెళ్లిన వచ్చిన తర్వాత జరుగు రావడంతో ఆస్పత్రికి వైద్య పరీక్షల కోసం వెళ్ళింది.
దీంతో ఆమె అభిమానులు ఆందోళన చెందారు. ఇక ఇప్పుడు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అయిన కరీనా కపూర్ కూడా కరోనా సోకింది. కరీనాతో పాటు ఆమె స్నేహితురాలు అమృత అరోరా కూడా కరోనా సోకినట్లు సమాచారం. వారిద్దరూ కరుణ నిబంధనలు ఉల్లంఘించి పలు పార్టీలకు హాజరయ్యారని సమాచారం. ఇక ఇలా సెలబ్రిటీలే ఇలాంటి నిబంధనలు ఉల్లంఘిస్తే.. ప్రజల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. ఇలాగే కొనసాగితే కరోన మరొకసారి తీవ్రరూపం దాల్చే అవకాశం కనిపిస్తోంది.