ప్రముఖ నటి సన్నీ లియోన్ నిజ జీవితం ఆధారంగా తెరక్కేక్కిన సినిమా ‘కరణ్‌జీత్ కౌర్: ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ సన్నీ లియోనీ’. తన జీవిత కథని సినిమాల కాకుండా వెబ్ సిరీస్ లాగా ప్రేక్షకుల ముందుకి తీసుకు రానున్నారు. గతంలో సల్మాన్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ‘బిగ్‌బాస్’ షో ద్వారా బాలీవుడ్ ప్రేక్షకులకి పరిచయం అయ్యారు సన్నీ, అటు తరువాత మెల్లగా సినిమా అవకాశాలు రావటం ప్రారంభించాయి, వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ బాలీవుడ్ లో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
ఈ క్రమంలో ఆమె జీవితం లోని యదార్ధ సంఘటలని వెబ్ సిరీస్ రూపం లో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ఈ బయోపిక్ ని నిర్మించారు. ఇందులో చిన్నతనం నుంచి ఆమె ఎదుర్కొన్న చేదు అనుభవాలను, మోడలింగ్ ఇండస్ట్రీలోకి ప్రవేశించటం తరువాత కొన్ని ఘాటైన ఫోటో షూట్లు ఇవ్వటం ప్రధానంగా చూపించారు. ఈ నెల 16 న ‘కరణ్‌జీత్ కౌర్’ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు నిర్మాతలు.