వివాదం లో చిక్కుకున్న సన్నీ బయోపిక్

Google+ Pinterest LinkedIn Tumblr +

బాలీవుడ్ లో స్టార్ కథానాయికలకు ధీటుగా గుర్తింపు సంపాదించుకున్న నటి సన్నీ లియోన్. ఒకప్పుడు అడల్ట్ చిత్రాలలో నటించిన సన్నీ మెల్లగా బాలీవుడ్ వైపు అడుగులు వేసింది. మొదట్లో సన్నీ పై కొంత మంది అభ్యంతరం వ్యక్తం చేసిన, తర్వాత సన్నీ అందానికి ఆమె నటానికి అభిమానులు ఫిదా అయ్యారు. ఇక ఇప్పుడు సన్నీ లియోన్ జీవిత కథ ఆధారంగా ఆదిత్య దత్ ” కరంజిత్ కౌర్ ” అనే పేరుతో ఒక వెబ్ సిరీస్ ని తెరకెక్కిస్తున్నారు.ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కి మంచి స్పందన వచ్చింది. అయితే ఈ బయోపిక్ కి ఇప్పుడు ఒక ఇబ్బందికర పరిస్థితి వచ్చి పడింది.

ఢిల్లీ సిక్కు గురుద్వారా కమిటీ (డి.యస్.జి.యమ్.సి) వారు ఈ చిత్ర టైటిల్ లో ఉన్న ‘కౌర్’ పై నిరసన వ్యక్తం చేసారు. ఆ పేరు పెట్టటం వలన సిక్కుల మనోభావాలు దెబ్బతింటాయని ‘డి.యస్.జి.యమ్.సి’ సభ్యులు తెలిపారట. అయితే ఈ వివాదం పై చిత్ర వర్గాలు ఎటువంటి నిర్ణయం ఇంకా తీసుకోలేదని సమాచారం. ఈ వెబ్ సిరీస్ ఈ నెల 16 న తేదీన విడుదల కానుంది.

Share.