సాధారణంగా తెరమీద అందంగా కనిపించే నటీనటుల జీవితాలలో అనేకమంది జీవితాలు తెరవెనుక విషాద గాధలుగా మిగిలే ఉంటాయి. ముఖ్యంగా వారు చెబితే తప్ప వారి బాధ ఏంటో సమాజానికి తెలియదు. అటువంటి నటులలో బేబీ అంజు అలియాస్ అంజు ప్రభాకరన్ కూడా ఒకరు. రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లో కూడా నటుడు కన్నడ ప్రభాకరన్ తన పట్ల విలన్ గా వ్యవహరించారని.. ఆమె పలు ఆసక్తికరమైన విషయాలను ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.
నటి అంజు ఎవరికి గుర్తు ఉండకపోవచ్చు.. కానీ శేషు సినిమాలో రాజశేఖర్ వదినగా నటించి మెప్పించిన యాక్టర్ అంటే ఇట్టే గుర్తుపడతారు. చైల్డ్ ఆర్టిస్టుగా వచ్చిన ఈమె తర్వాత హీరోయిన్ కూడా అయ్యారు.. తమిళ, మలయాళం, తెలుగు , కన్నడ చిత్రాలలో నటించారు. తెలుగులో శోభన్ బాబు, చిరంజీవి, మోహన్ బాబు వంటి సినిమాలలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన ఈమె 17 ఏళ్ల వయసులో తీసుకున్న ఒక నిర్ణయం ఈమె జీవితాన్ని నాశనం చేసింది. తనకంటే సుమారు 30 సంవత్సరాల పెద్దవాడైన ఒక నటుడుని వివాహం చేసుకుంది. ఆయన ఎవరో కాదు కన్నడ ప్రభాకరన్.
తన స్నేహితుల ద్వారా తనను వివాహం చేసుకుంటానని కబురు పంపారని తెలిపింది అంజు.. అప్పుడు తన వయసు 17 ఏళ్ళని .. తాను పెళ్లికి సిద్ధంగా లేనని.. సినిమాలే చేయాలని భావించాలనుకుంటున్నానని తెలిపారట. ఈ విషయం పదే పదే అడగడంతో అమ్మా నాన్నలకు చెప్పానని తెలిపారు. అమ్మ బెంగళూరుకి వచ్చి కన్నడ ప్రభాకరన్ ను చూసి షాక్ అయ్యారు. ఎందుకంటే అప్పటికే ఆయన వయసు మా నాన్న కంటే ఎక్కువ అని.. సుమారు 50 యేళ్లు ఉంటాయని అమ్మ తెలిపింది. అయితే అమ్మ చెన్నై వెళ్ళిపోతే నేను ఇంటికి వెళ్లి ఒప్పించేందుకు ప్రయత్నించాను. అయినా అమ్మ నాన్నలు ఒప్పుకోలేదు. అయితే వారి పర్మిషన్ లేకుండానే వివాహం చేసుకున్నాం. వివాహం చేసుకున్న ఆరు నెలలకి నేను ప్రెగ్నెంట్ గా ఉన్న సమయంలో పిల్లల్ని చూపించారు. అప్పటికే కన్నడ ప్రభాకరన్ కు రెండు పెళ్లిళ్లు జరిగాయని.. తాను మూడవ దాన్నని తెలిసి మోసపోయాను. నమ్మకద్రోహం చేశాడు. అతను నా జీవితంలో విలన్ అంటూ ఆమె చెప్పుకొచ్చింది.