కన్నీటిని తెప్పిస్తున్న RRR జననీ గ్లింప్..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

జక్కన్న దర్శకత్వంలో మల్టీస్టారర్ మూవీగా తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధిరం సినిమా నుంచి తాజాగా జననీ సాంగ్ విడుదల కాగా చూసినవారంతా వీడియో అప్పుడే అయిపోయిందా అంటూ దిగులు పడుతున్నారు. చూస్తున్నంతసేపూ శరీరంపై రోమాలు నిక్క పొడిచేలా..కంటి నుండి కన్నీరు వచ్చేలా ఈ పాట ఉండడం గమనార్హం.

దర్శక ధీరుడు రాజమౌళి విజన్‌ను ఫర్‌ఫెక్ట్‌గా అర్థం చేసుకునే వ్యక్తుల్లో… ఆయన పెద్దన్న, సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి ఒకరు. ‘ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం’ సినిమానూ బాగా అర్థం చేసుకున్నారు.అంతే కాదు… సన్నివేశాలు చూసి ఓ నేపథ్య గీతాన్ని రూపొందించారు. అదే ‘జనని…’ సాంగ్. తొలుత ఈ పాటను అనుకోలేదని, నేపథ్య సంగీతంలో భాగంగా వచ్చిందని రాజమౌళి తెలిపారు. ఈ పాటను కీరవాణి రాశారు.

ఇక తాజాగా విడుదలైన ఈ పాట గ్లింప్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అంతే కాదు కేవలం ముప్పై నిమిషాల వ్యవధిలో నాలుగు మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకోవడం గమనార్హం.

Share.